Pawan Kalyan: మీ ధమ్కీలకు భయపడేది లేదు.. ఓవైసీ బ్రదర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

Maharashtra Assembly Elections 2024:  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన ఓవైసీ బ్రదర్స్ ను ఏకీ పారేశారు. దీంతో మళ్లీ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 16, 2024, 04:35 PM IST
  • మహారాష్ట్రలో రెచ్చిపొయిన పవన్ కళ్యాణ్..
  • ఛత్రపతీ వారసులమని కౌంటర్..
Pawan Kalyan: మీ ధమ్కీలకు భయపడేది లేదు.. ఓవైసీ బ్రదర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

Pawan kalyan fires on Owaisi brothers: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సనాతన ధర్మంకోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సనాతన ధర్మం కోసం ఎంతదూరమైన వెళ్లేందుకైన వెనుకాడనని కూడా స్పష్టం చేసిన చేశారు. తాజాగా, పవన్ కళ్యాణ్..  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వెళ్లారు. ఆయన రెండు రోజుల పాటు అంటే.. 16, 17 తేదీల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు ఆయన డేగ్లూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

మహారాష్ట్ర ఎందరో సాధు, సంత్ లు నడిచిన నెలగా అభివర్ణించారు. అంతే కాకుండా.. బాబా సాహేబ్ అంబేద్కర్, రాజ మాత జిజియా బాయి, ఛత్రపతి శివాజీ, బాలా సాహేబ్ ఠాక్రే వంటి ఎంతో మంది మహానీయులు నడయాడిన ప్రదేశమన్నారు. అంత గొప్ప నేతలు మహారాష్ట్రలో నడియాడినారని గుర్తు చేసుకున్నారు. తాను మరాఠిలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారని, తప్పులు ఉంటే పెద్ద మనస్సుతో  క్షమించండన్నారు. ఆ తర్వాత మరాఠీలో ఆయన స్పీచ్ ఇచ్చారు. బాలాసాహేబ్ గారిని ఆదర్శంగా తీసుకుని.. తమ పార్టీ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతుందన్నారు. 

 అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ గతంలో అనేక సంచలన నిర్ణయాలను తీసుకుందన్నారు. ఆర్టికల్ 370, అయోధ్య భవ్యరామమందిరం వంటివి చాలా ఉన్నాయన్నారు. అంతే కాకుండా.. దేశంలోని జాతీయ రహాదారులు,  4 కోట్ల రైతులకు పంట బీమాను బీజేపీ అందించిదన్నారు. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరిందని తెలిపారు. ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చిందని స్పష్టం చేశారు.

 
కేంద్ర మంత్రి..  శ్రీ నితిన్ గడ్కరీ గారు 11 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించారని, మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి థానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ది మహామార్గాన్ని నిర్మించారని తెలిపారు.     2028 లోపు మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే తమ టార్గెట్ అన్నారు.

ఇలాంటి తరుణంలో డేగ్లూర్ నియోజకర్గ అభివృద్ధి చాలా కీలకమని తెలిపారు.. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని.. ప్రభుత్వ విశ్రాంతి గృహం, డేగ్లూర్, బిలోమీ పోలీస్ స్టేషన్లు, కోర్టుల నిర్మాణం, హేమంత్ పంత్ ఆలయ నిర్మాణం, కుందల్ వాడీ బేవలీ రోడ్డు మార్గం నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు.  

ప్రస్తుతం ప్రజలు.. మీ కలలన్నీ  నెరవేరాలంటే.. ఎన్డీఏకు డేగ్లూర్ యువత, ఆడబిడ్డలు ప్రజల మద్దతు కావాలన్నారు. ఛత్రపతీ శివాజీ మహారాజ్ ముస్లింల దండయాత్రల నుంచి ఆలయాలను కాపాడారన్నారు. మనందరం కలిసి కట్టుగా ఉండి... మహాయుతికి పట్టం కడదామన్నారు. ఈ నేపథ్యంలో..  ఓవైసీ బ్రదర్స్ పై మండిపడ్డారు. ఇటీవల అసదుద్దీన్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వచ్చి.. మాకు 15 నిమిషాలు ఇవ్వండని మళ్లీ ఇన్ డైరెక్ట్ గా కాంట్రవర్షీగా మాట్లాడారు.  దీంతో  ఒక్కసారిగా రాజకీయంగా దుమారంగా మారింది. కొంతమంది దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చూస్తున్నారని అన్నారు.

Read more: APSRTC: బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. ఇక నుంచి జర్నీలో 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలు ఇవే..

గతంలో కూడా పాత బస్తీ పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే.. తమ  తడాఖ చూపిస్తామని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ మాట్లాడుతూ.. ఇలాంటి ధమ్కీలకు భయపడేది లేదని.. ఛత్రపతి శివాజీ నడిచిన నెల అన్నారు. అంతేకాకుండా.. సినిమాల్లో గొడవలు పెట్టుకొవడం కామన్ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం పోరాటం చేయడం కోసం చాలా ధైర్యం కావాలన్నారు. ప్రస్తుతం దేగ్లూర్ లో ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News