Yash Donation : యశ్ గొప్పదనం.. అడక్కుండానే గుడికి విరాళం.. నాటి సంగతులు చెప్పిన తమిళ నటుడు

Tamil Actor Daniel Balaji తమిళ నటుడు డానియల్ బాలాజీ యశ్ మీద చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతోన్నాయి. అడక్కుండానే యశ్ తాను కట్టించిన గుడికి విరాళం ఇచ్చాడంటూ తమిళ నటుడు చెప్పిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 12:58 PM IST
  • గుడి కట్టిన తమిళ నటుడు
  • విరాళం ఇచ్చిన యశ్
  • గొప్పదనం చెప్పిన డానియల్ బాలాజీ
Yash Donation : యశ్ గొప్పదనం.. అడక్కుండానే గుడికి విరాళం.. నాటి సంగతులు చెప్పిన తమిళ నటుడు

Yash Donation to Temple కేజీయఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న రాకింగ్ స్టార్ యశ్. రాకీ భాయ్ కారెక్టర్‌లో యశ్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు యశ్‌కి నేషనల్ లెవెల్లో స్టార్డం వచ్చింది. అందుకే ఆ స్థాయికి తగ్గ కథలతోనే సినిమాలు తీయాలని యశ్ భావిస్తున్నాడు. చాప్టర్ 2 వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఇంత వరకు సినిమాను అనౌన్స్ చేయలేదు. చాలా ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు.

యశ్ గురించి తాజాగా తమిళ నటుడు డానియల్ బాలాజీ మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం నాలుగేళ్ల క్రితం జరిగిందట. యశ్ తనకు కాల్ చేశాడట. ఓ కథ చెప్సాడట. నటించమని అడిగాడట. అందుకే డానియల్ బాలాజీ ఇలా అన్నాడట. ఓ ఇరవై రోజులు బయటకు రాలేనని, గుడి కట్టిస్తున్నానని, ఆ పని పూర్తయ్యే వరకు తాను బయటకు రాలేనని చెప్పేశాడట. సరే ఓకే అని యశ్ కూడా ఫోన్ పెట్టేశాడట.

ఆ తరువాత కూడా తరుచుగా ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారట. అలా ఓ సారి ఫోన్‌లో మాట్లాడుతుండగా.. కొంత అమౌంట్ క్రెడిట్ అయిందనే మెసెజ్ వచ్చిందట. అది యశ్ దగ్గరి నుంచి వచ్చిందని తెలిసి.. ఎందుకు పంపించారని అడిగాడట. తాను ఇంకా సినిమాను చేస్తానని చెప్పలేదు.. డేట్స్ కూడా ఇవ్వలేదని అయినా ఎందుకు పంపించారు.. ఈ సినిమాకు మీరేనా నిర్మాత? అని ఇలా ఒకే సారి ప్రశ్నలు కురిపించాడట. అయితే వీటన్నంటికి సింపుల్‌గా నవ్విన యశ్.. అది నీకు కాదు.. గుడికి విరాళం అని చెప్పాడట.

యశ్ మంచి మనసు గురించి డేనియల్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ యాక్టర్స్ ఎక్కువగా భక్తిభావంతో ఉంటారని, అర్జున్ ఆంజనేయుడికి గుడి కట్టించాడని, డేనియల్ బాలాజీ ఇలా అమ్మవారి గుడి కట్టించాడని, దానికి యశ్ కూడా సాయం చేశాడని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

Also Read:  Prabhas Salaar : పాటలు, కామెడీ లేకుండానే విడుదల.. సలార్ మేకర్ల నిర్ణయం కరెక్టే!

Also Read: Jabardasth Indraja : షోలో ఇంద్రజకు అవమానం.. ఇది కరెక్ట్ కాదంటూ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News