రాజమండ్రిలో సూర్యను గేటు దూకేలా చేసిన అభిమానులు

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుందని చెప్పడానికి ఓ చక్కటి ఉదాహరణ ఈ ఘటన.

Last Updated : Jan 17, 2018, 10:11 AM IST
 రాజమండ్రిలో సూర్యను గేటు దూకేలా చేసిన అభిమానులు

తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళనాడులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుందని చెప్పడానికి ఓ చక్కటి ఉదాహరణ ఈ ఘటన. సూర్య నటించిన 'తానా సెంర్ద కూట్టమ్' సినిమా తెలుగులో 'గ్యాంగ్' పేరిట డబ్ అయి విడుదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా తమిళంలో హిట్ అయిన విధంగానే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో రాజమండ్రిలో గ్యాంగ్ మూవీ యూనిట్ సోమవారం ఓ సక్సెస్ మీట్ నిర్వహించింది. 

ఈ సక్సెస్ మీట్‌కి హాజరయ్యేందుకు రాజమండ్రిలోని ఓ థియేటర్‌కి వచ్చిన సూర్యను అభిమానులు చుట్టుముట్టారు. భారీ సంఖ్యలో తనని చుట్టుముట్టిన అభిమానుల నుంచి తప్పించుకుని బయటకు రావడం సూర్యకు గగనమైంది. దీంతో సూర్య ప్రధాన ద్వారం ద్వారా కాకుండా ఆ పక్కనే ఉన్న గేటును దూకి బయటకు వచ్చేశాడు. అయితే, అంతకన్నా ముందుగా సాధ్యమైనంత వరకు తన అభిమానులని అందరినీ పలకరించమేకాకుండా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వారి మనసు దోచుకున్నాడు సూర్య. సూర్యకు టాలీవుడ్ లోనూ భారీ సంఖ్యలో అభిమానులు వున్నారని నిరూపించింది ఈ ఘటన. 

Trending News