DA DA Release Date: తమిళంలో మంచి విజయాలు సాధించిన చిత్రాలను.. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో తమిళ చిత్రాలు తెలుగులో విడుదలై.. బ్లాక్ బస్టర్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు తమిళ హీరోలని తమ సొంత తెలుగు హీరోలగా చూసుకుంటూ ఉంటారు తెలుగు సినీ ప్రేక్షకులు.
ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల కోసం ఒక ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామా రాబోతోంది. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘డా..డా’ చిత్రం తెలుగులో ‘పా.. పా..’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని జెకె ఎంటర్టైన్మెంట్స్.. బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 13న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
గత ఏడాది తమిళంలో ‘డా..డా’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కవిన్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండు.. నేపథ్యంలో సినిమా సాగుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్‌లో అద్భుతమైన స్పందన లభించింది. అలాగే, ఈ చిత్రం 30 కోట్లు వసూలు చేసి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
‘పా.. పా..’ అనే పేరుతో తెలుగులో విడుదలై..తెలుగు ప్రేక్షకులకి కూడా ఎంతో ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని నిర్మాత నీరజ కోట వ్యక్తం చేశారు. ఈ సినిమా మిగిలిన దేశాల్లో మరింత విజయాన్ని సాధించనుందని ఆయన చెప్పారు. సినిమాను ఎంజీఎం సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమా ప్రధాన సాంకేతిక సభ్యులు విషయానికి వస్తే చేయక ఎంటర్టైన్మెంట్ ద్వారా నీరజ కోట.. నిర్మిస్తుండగా జెన్ మార్టిన్ సంగీతం అందిస్తున్నారు. రవివర్మ ఆకుల సాహిత్యం వహిస్తుండగా కడలి రాంబాబు, అశోక్ దయ్యాల.. వీఆర్వో లాగా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter