Vijaykanth: విజయ్‌కాంత్‌ తెలుగోడే... ఆంధ్ర నుంచి వలస వెళ్లిన ఫ్యామిలీ..

Vijaykanth Death: తమిళ సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ కొంతకాలంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేక హాస్పిటల్ లో కొద్ది రోజులు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఇటీవలే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు కానీ అంతలోనే కరోనా బారీన పడి మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 10:46 AM IST
Vijaykanth: విజయ్‌కాంత్‌  తెలుగోడే... ఆంధ్ర నుంచి వలస వెళ్లిన ఫ్యామిలీ..

Vijaykanth Interesting Fact

తమిళ యాక్షన్ హీరో.. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ ఈ రోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా ఆందోళన కరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ హీరో ఇటీవలే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ అంతలోనే కరోనా బారీన పడి ఈరోజు ఉదయం ఈ యాక్షన్ హీరో మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. 

విజయ్‌కాంత్ 80, 90 దశకాల్లో వందలాది చిత్రాల్లో నటించి అలరించారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈయన ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. 1979లో ఇనిక్కుం ఇలామై చిత్రంతో తమిళ ఇండస్టీలో ఆడుగు పెట్టగా.. ఆయన 154 పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో పోలీస్ క్యారెక్టర్ చిత్రం అంతే విజయ్ కాంత్ గుర్తొచ్చేవారు. దాదాపు 20 సినిమాలకు పైగా ఆయన పోలీసుగా నటించారు. ఇక సినిమా ఇండస్ట్రీలో సూపర్ యాక్షన్ హీరోగా పేరు పొందిన విజయ్ కాంత్ ఆ తర్వాత డీఎండీకే పార్టీని స్థాపించి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌కాంత్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నాయకుడు అంటూ తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది.

అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ కి కరోనా సోకడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యులకు.. లక్షలాదిమంది అభిమానులకు దూరం అవుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇక ఈ వార్త ఈరోజు సినీ రాజకీయ లోకాన్ని శోకంలో ముంచేసింది. దీనితో విజయ్ కాంత్ అభిమానులు ఆయన సేవల్ని, నటించిన చిత్రాలని గుర్తు చేసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ కాంత్ ది తెలుగోడి రక్తమే అనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ విషయాన్ని విజయ్ కాంత్ స్వయంగా ఓ సందర్భంలో వివరించారు. వందల ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో తన తాత ముత్తాతలు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వలస వెళ్లారట. ఆ విధంగా విజయ్ కాంత్ కి పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ తో సంబంధం ఉంది. ఆయన తాతలు ఇక్కడి వారే అని కానీ ఆ తర్వాత తరం వారి దగ్గర నుంచి తమిళనాడు రాష్ట్రంలో సెటిల్ అయ్యారని తెలుస్తోంది. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News