Taapsee: ఎంతో మందితో డేటింగ్ చేశాను.. అతను మాత్రం ప్రత్యేకం అంటూ తాప్సీ బోల్డ్ కామెంట్స్..

Taapsee: తాప్సీ పన్ను గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. చాలా మంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. తను ఎంతో మందితో డేటింగ్ చేశాను కానీ అతను మాత్రం ప్రత్యేకం అంటూ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 14, 2024, 12:01 PM IST
Taapsee: ఎంతో మందితో డేటింగ్ చేశాను.. అతను మాత్రం ప్రత్యేకం అంటూ తాప్సీ బోల్డ్ కామెంట్స్..

Taapsee: తాప్పీ తెలుగు ఆడియన్స్‌కు కొత్తగా పరిచయాలు అక్కర్లేని పేరు. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన 'ఝుమ్మంది నాదం' మూవీతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలో ఈమె చేసిన అందాల ఆరబోతకు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. తెలుగులో వరుసగా అలాంటి క్యారెక్టర్స్‌ రావడంతో .. వెంటనే తన మఖాం ముంబైకి షిప్ట్ చేసింది. అక్కడ 'చష్మే బద్దూర్' మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత అక్కడ లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో తన కంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది. తెలుగులో సరైన పాత్రలు దక్కినీ ఈమెకు బాలీవుడ్‌లో మాత్రం నటనకు అవకాశం ఉన్న పాత్రలు దొరకాయి. అంతేకాదు ఆయా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో ఈమెకు అక్కడ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. 

కెరీర్ కొత్తలో అందాల ఆరబోతను నమ్ముకున్న తాప్సీ పన్ను.. ఇపుడు నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తోంది. గతేడాది చివర్‌లో బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ హీరోగా నటించిన 'డంకీ' మూవీలో హీరోతో సమానమైన పాత్రలో నటించి మెప్పించింది. 

తాప్సీ పన్ను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ముందుగా దక్షిణాది రచ్చ చేసిన ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తన సొంతా ఇలాకాలో ఇలాయించేస్తోంది. త్వరలో ఈ భామ పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.  మరోవైపు తాప్సీ ఓ వ్యక్తితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్టు తెలిపింది. అతను ఇండస్ట్రీ మనిషి కాదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె మథియాస్‌ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. 

తాజాగా అతని గురించి మాట్లాడుతూ.. తను గతంలో కొంత మంది అబ్బాయిలతో డేటింగ్, స్నేహం చేశాను. కానీ తనకు ఎవరి వ్యక్తిత్త్వం తనను నచ్చలేదన్నారు. కానీ మథియాస్‌లో  మాత్రం తనకు నిజాయితీ, జీవితం పట్ట అంకిత భావం తనకు నచ్చాయన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్త్వం ఉన్న వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. అది మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక తాప్సీ ప్రియుడు మథియాస్ విషయానికొస్తే.. ఇతను ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారుడు. డెన్నార్క్ దేశస్థుడు. ఇక తాప్సీ, మథియాస్ గత పదేళ్లుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.  వీళ్లిద్దరు త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. తాప్సీ పన్నుకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో 20.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 

Also Read: KCR Speech: టీవీ ముందు కూర్చుంటా.. రేవంత్‌ రెడ్డి తాట తీస్తా: కేసీఆర్‌ సంచలన ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News