Bigg Boss Telugu 7 : ఈవారం ఎలిమినేట్ అయిన హౌస్ మేట్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Tasty Teja Remuneration For Bigg Boss: బిగ్ బాస్ అప్పుడే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ మధ్య మొత్తం ఫిమేల్ హౌస్ మేట్స్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా.. గత వారం నుంచి మాత్రం మెల్ హౌస్ మేట్స్ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. గతవారం ఆట సందీప్ ఎలిమినేట్ కాగా ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్ కానున్నారు. ఈ నేపథ్యంలో టేస్టీ తేజ తీసుకున్న నిర్ణయం రెమ్యూనరేషన్ అనే ఒక వార్త వైరల్ అవుతోంది..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2023, 08:42 PM IST
Bigg Boss Telugu 7 : ఈవారం ఎలిమినేట్ అయిన హౌస్ మేట్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Bigg Boss Telugu 7: గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ బిగ్ బాస్ పరవాలేదు అనిపించుకుంటటోంది. అనుకోని ఎలిమినేషన్స్.. ఎక్కువ వైల్డ్ కార్డు ఎంట్రీ లతో ప్రస్తుతానికి సాఫీగా సాగుతోంది బిగ్ బాస్. కాగా ఈవారం అందరూ శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుంది అనుకోగా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆమె ఏకంగా గత వారం కెప్టెన్ అయిపోయింది.

ఇక ఈ తొమ్మిదవ వారం శోభ సేఫ్ కాగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. మొదటి నుంచి టేస్టీ తేజ కామెడీ చేస్తూ షోలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ తన కామెడీ అలానే పర్ఫామెన్స్ ఈ మధ్య పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో మొత్తం పైన తొమ్మిదో వారం ఎలిమినేట్ అయిపోయారు. ఈ విషయం ఈరోజు అధికారికంగా చెప్పబోతున్నారు నాగార్జున. ఈ నేపథ్యంలో ఈ తొమ్మిది వారాలకు గాను టేస్టీ తేజకు వచ్చిన సంపాదన అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది. ఇంకా ఆయన ఈ తొమ్మిది వారాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

జబర్దస్త్ కమెడియన్ గా, అలానే ఫుడ్ బ్లాగర్ గా పేరు తెచ్చుకున్న టేస్టీ తేజ.. బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యి మొదటి వారం నుంచి తొమ్మిదో వారం వరకు హౌస్ లో ఉన్నారు. టేస్టీ తేజ వంతు వచ్చింది. ఇక తొమ్మిదో వారంలో ఈయన ఇంటి నుంచి బయటకు వచ్చే గా ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం శివాజీ, అర్జున్, భోలే, అశ్విని, గౌతమ్, అమర్, ప్రియాంక, శోభా, యావర్, ప్రశాంత్, రతిక మాత్రమే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యునరేషన్ అందరి దృష్టిని తన వైపు మళ్లించుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టేస్టీ తేజకు 
 ఒక్క రోజుకి రూ. 21, 428 పారితోషికంగా బిగ్ బాస్ నిర్వాహకులు డీల్ కుదుర్చుకున్నారట. ఈ లెక్కన ఆయనకి ఒక వారానికి 1,50,000 .. కాగా ఈయన 9 వారాలు ఉండడంతో కాబట్టి మొత్తం 9 వారాలకు తేజ రూ. 13 లక్షల 50 వేలు సంపాదించాడని తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ ద్వారా దాదాపు 14 లక్షలు వెనకేసుకున్నారు టేస్టీ తేజ.

Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!  

Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News