టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో నటుడు జాన్ కొట్టోలీ కన్నుమూత

John Kottoly Death: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఫలక్‌నుమా దాస్ ఫేమ్ జాన్ కొట్టోలీ చనిపోయారు. సినీ ప్రముఖులు జాన్ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు.

Updated: Jan 29, 2020, 07:00 AM IST
టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో నటుడు జాన్ కొట్టోలీ కన్నుమూత
Image Courtesy: Twitter

హైదరాబాద్: టాలీవుడ్‌‌లో విషాదం చోటుచేసుకుంది. రచయిత, నటుడు జాన్‌ కొట్టోలీ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశాడు. జాన్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జాన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటుడిగా, ఓ మంచి మనిషిని కోల్పోయానని దర్శకుడు ఇంద్రగంటి మోహనక్రిష్ణ ట్వీట్ చేశారు. జాన్‌ ఆకస్మిక మరణం నిజంగా దురదృష్టకరమని హీరో సుధీర్‌ బాబు అన్నారు. 

కమెడియన్ రాహుల్ రామక్రిష్ణ, దర్శకుడు సాయి రాజేష్ సహా పలువురు సోషల్ మీడియాలో స్పందించారు. జాన్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని, గొప్ప నటుడు చనిపోయారంటూ కామెంట్ చేస్తున్నారు. నటుడు జాన్.. ఫలక్‌నుమా దాస్‌, మను, మహానటి, యుద్ధం శరణం, సమ్మోహనం, రక్తం, బొమ్మల రామారాం చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. చివరగా తెలుగు వెబ్ సిరీస్ ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ షార్ట్ ఫిల్మ్‌లో కనిపించాడు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..