Maithili Suicide Attempt: బుల్లితెర నటి మైథిలి ఆత్మహత్యాయత్నం... నిమ్స్‌కు తరలింపు...

TV Actress Maithili Suicide Attempt: టీవీ నటి మైథిలి ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఆమె ఆత్మహత్యకు యత్నించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 06:55 AM IST
  • టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం
  • పాయిజన్ సేవించి ఆత్మహత్యకు యత్నించిన మైథిలి
  • ప్రస్తుతంనిమ్స్ఆసుపత్రిలో మైథిలికి చికిత్స
 Maithili Suicide Attempt: బుల్లితెర నటి మైథిలి ఆత్మహత్యాయత్నం... నిమ్స్‌కు తరలింపు...

TV Actress Maithili Suicide Attempt: తెలుగు టీవీ నటి మైథిలి (34) ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులకు వీడియో కాల్ చేసిన మైథిలీ... లైవ్‌ లోనే పాయిజన్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఓ కేసు విషయంలో తనకు న్యాయం జరగట్లేదని వాపోతూ మైథిలీ ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైథిలి పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియళ్లలో మైథిలీ నటిస్తోంది. అమీర్‌పేట పరిధిలోని ఎల్లారెడ్డిపేటలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భర్త, పిల్లలతో కలిసి నివసిస్తోంది. కొద్ది నెలల క్రితమే పంజాగుట్ట నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. పంజాగుట్టలో ఉన్న సమయంలో మైథిలి బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై పంజాగుట్ట పోలీసులకు గతంలోనే ఆమె ఫిర్యాదు చేసింది.

చోరీ నగల కేసుకు సంబంధించి తరచూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తోంది. పోలీసుల తీరుతో విసిగిపోయిన ఆమె సోమవారం (మే 30) వారికి వీడియో కాల్ చేసింది. తన కేసు విషయంలో న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వీడియో కాల్‌లోనే పాయిజన్ సేవించింది. వెంటనే అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు మైథిలి ఉండే చోటుకు వెళ్లి ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read: Satyendar Jain: ఢిల్లీలో కీలక పరిణామం..మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్..!

Also Read: Horoscope Today May 31 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లవ్ బ్రేకప్ అయ్యే ఛాన్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News