"తొలిప్రేమ" ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్..!

మెగా ఫ్యామిలీ నుండి నట ప్రస్థానం సాగించిన మరో యువ నటుడు వరుణ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రమే ‘తొలిప్రేమ’. 

Last Updated : Feb 2, 2018, 11:22 AM IST
"తొలిప్రేమ" ట్రైలర్‌కి సూపర్  రెస్పాన్స్..!

మెగా ఫ్యామిలీ నుండి నట ప్రస్థానం సాగించిన మరో యువ నటుడు వరుణ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రమే ‘తొలిప్రేమ’. ఈ రోజే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లోని డైలాగ్స్‌తో పాటు హీరో హీరోయిన్ల మధ్య నడిచిన కెమిస్ట్రీ సినిమాపై ఆసక్తి కలిగించేలా ఉందని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు  పలువురు అభిమానులు. ‘కలగా నా జీవితంలోకి వచ్చావ్‌. కలగంటున్నప్పుడు వెళ్లిపోయావ్‌.. మళ్లీ ఇలా మెరిశావ్‌‌. కలో నిజమో అర్థం కావడంలేదు’ లాంటి ఆకట్టుకొనే సంభాషణలు ఈ చిత్రంలో ఉండడం విశేషం. వెంకట్ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం, విద్యుల్లేఖ రామన్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించడం గమనార్హం.

"తొలిప్రేమ" పేరుతో గతంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలియంది కాదు. ఇప్పడు అదే పేరుతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం మరి వరుణ్‌కి ఎలాంటి హిట్ ఇస్తుందోనని వేచి చూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే కంచె, ఫిదా లాంటి వైవిధ్యమైన సినిమాలతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ "తొలిప్రేమ" అనే మరో రొమాంటిక్ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తాడో వేచి చూడాల్సిందే. తేరి, రాజారాణి వంటి తమిళ సినిమాలకు కెమెరామెన్‌గా వ్యవహరించిన జార్జి సి విలియమ్స్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం ఈ నెల 10వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది

Trending News