Mahesh Babu- Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ జోడీ గా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో సమంత , మహేష్ బాబు జంట కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు వంటి సినిమాలలో నటించి ,ఆ చిత్రాలతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఒకసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా షూటింగ్ జరిగే సమయంలో సరదాగా మహేష్ బాబును సమంత ఇంటర్వ్యూ చేసింది.
ఆ ఇంటర్వ్యూలో మహేష్ పక్కన త్రివిక్రమ్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా సమంత.. మహేష్ బాబుతో ఇటీవల ఏ సినిమా చూశారు? అని అడిగితే, తమిళ్లో విజయ్ చేసిన కత్తి సినిమా చూశానని మహేష్ తెలిపారు. వెంటనే సమంత నోటిలో మాట అందుకొని ఆ సినిమాని రీమేక్ చేయొచ్చు కదా అని అడిగింది. దాంతో మహేష్ బాబు.. నేను రీమేక్ చేయను. అసలు ఏ సినిమా కూడా రీమేక్ చేయను అంటూ కుండబద్దలు కొట్టేశారు.
ఏదైనా సినిమా రీమేక్ చేసే సమయంలో ఆ సినిమాలో నటించిన హీరోనే గుర్తుకొస్తారు. ఏదైనా కొత్తగా ప్రయత్నం చేద్దాం అనుకున్నా అసలు కుదరదు. అలాంటప్పుడు నేను ఏ సినిమా అయినా రీమేక్ ఎలా చేయగలను అంటూ ప్రశ్నించారు.ఒకవేళ కత్తి సినిమాలో రీమేక్ చేసినా సరే నాకు విజయ్ గుర్తుకొస్తాడు అంటూ తెలిపారు మహేష్ బాబు.
మరి మీ సినిమాలన్నీ విజయ్ రీమేక్ చేస్తున్నారు కదా అని మళ్లీ సమంత అడిగితే, రీమిక్స్ చేసే వారిని ఎప్పుడూ నేను తక్కువ చేసి చూడను అంటూ తెలిపారు మహేష్ బాబు.
సరదాగా త్రివిక్రమ్ తో ఎప్పుడు మీ నెక్స్ట్ సినిమా చేస్తున్నారు? అందులో నేనే కదా హీరోయిన్..అంటూ సమంత ప్రశ్నించగా..కచ్చితంగా మనిద్దరం మళ్ళీ సినిమా చేద్దాం.. కానీ నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ నువ్వో, కాదో తెలియదు అంటూ తెలిపారు మహేష్ .ఇక తర్వాత మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నేనే కదా.. కానీ నేను కాకుండా వేరే అమ్మాయి పేరు చెప్పండి అని సమంత అడగ్గా.. నాకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ నే నేను వివాహం చేసుకున్నానని నమ్రత శిరోద్కర్ పేరు తెలిపారు. దీంతో అందరూ నవ్వేశారు. మొత్తానికైతే ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడే మహేష్ బాబు రీమిక్స్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు.
Also Read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో Infinix
Also Read: Malaika father Suicide: స్టార్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.