Tillu Square 3 Days Box Office Collections: మూడో రోజు ఆగని టిల్లు స్వ్కేర్ బాక్సాఫీస్ ఊచకోత.. ఇది కదా అసలు సిసలు వేట..

Tillu Square 3 days box office Collections: ప్రస్తుతం తెలుగులో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో 'డీజే టిల్లు' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మూడో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర అదే జోరును కంటిన్యూ చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 1, 2024, 11:58 AM IST
Tillu Square 3 Days Box Office Collections: మూడో రోజు ఆగని టిల్లు స్వ్కేర్ బాక్సాఫీస్ ఊచకోత.. ఇది కదా అసలు సిసలు వేట..

Tillu Square 3 days box office Collections: 'డీజే టిల్లు' అనే ఒకే ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ బాయ్‌గా మారాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టిల్లు స్వ్కేర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తంగా టిల్లు బ్రాండ్‌తో ఈ సినిమాకు దిమ్మ దిరిగే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక జోరును రెండు రోజు కంటిన్యూ అయింది. మూడు రోజు సండే హాలీడే కలిసొచ్చింది. మరోవైపు సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్‌లున్నా అదేమి టిల్లు బాక్సాఫీస్ జోరకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. సిద్దు జొన్నలగడ్డ విషయానికొస్తే.. దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ నాగ చైతన్య హీరోగా నటించిన 'జోష్‌' మూవీలో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి చిన్నా చితకా పాత్రలతో కెరీర్‌ బండిని లాక్కొస్తున్నాడు. మొత్తంగా ఎన్నో ఒడిదుడుకుల తర్వాత సిద్దుకు డీజే టిల్లు మూవీతో పెద్ద బ్రేక్ వచ్చింది. అప్పట్లో గుంటూరు టాకీస్‌ మూవీలో నటుడిగా ఓ  మోస్తరుగా ఆకట్టుకున్నాడు. ఇక 2022లో విడుదలైన టీజే టిల్లు మూవీతో సిద్దు జొన్నలగడ్డ దశ, దిశ తిరిగింది.

ఈ సినిమా సక్సెస్‌తో హీరోగా సిద్దు రేంజ్‌ పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీతో మరోసారి ప్రేక్షకులను తన మాయలో పడేసాడు.  రిలీజ్ రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకొని బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది.  తొలిరోజే దాదాపు రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది 'టిల్లు స్క్వేర్' మూవీ రెండో రోజు అదే జోరును కొనిసాగించింది. అటు 10th, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడం టిల్లు స్క్వేర్‌కు కలిసొచ్చాయి. మొత్తంగా వెళుతూ, వెళుతూ  మార్చి నెలకు గుడ్ ఎండ్ కార్డ్ వేసిందనే చెప్పాలి.

టిల్లు స్క్వేర్ విషయానికొస్తే.. మొదటి పార్ట్ చూసినవారు రెండో పార్ట్‌కు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక డీజే టిల్లు మాదిరి మాత్రం ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కనక వర్షం కురిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమా మరి చెత్తగా లేదు... మరి కొత్తగా లేదనే వాదనలు ప్రేక్షకుల నుంచి వచ్చినా.. మౌత్ టాక్‌తో దూసుకుపోతుంది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు.. రూ. 9.25 కోట్ల షేర్
రెండో రోజు తెలంగాణ, ఏపీలో రూ. 7.36 కోట్ల షేర్ రాబట్టింది.
మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 9 కోట్ల వరకు షేర్ రాబట్టింది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల వసూళ్ల విషయానికొస్తే..
తొలి రోజు..  రూ. 14.30 కోట్ల షేర్ (రూ. 23.70 కోట్ల గ్రాస్)
రెండో రోజు.. రూ. 10.81 కోట్ల షేర్ (రూ. 18.90 కోట్ల గ్రాస్)
మూడో రోజు.. రూ. 12.01 కోట్ల షేర్ (రూ. 21.01 కోట్ల గ్రాస్)
వసూళ్లను రాబట్టాయి. ఓవరాల్‌గా మూడు రోజుల్లో 39 కోట్ల షేర్ (రూ. 68 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

తెలంగాణ  (నైజాం).. రూ. 8 కోట్లు..
రాయలసీమ( సీడెడ్).. రూ. 3 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 11 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 22 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 2 కోట్లు
ఓవర్సీస్ .. రూ. 3 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 8 కోట్ల ఫ్రాఫిట్ అందుకొని టాలీవుడ్‌లో మరో ఎపిక్‌గా హిట్‌గా నిలిచింది. అంతేకాదు హనుమాన్ తర్వాత ఆ రేంజ్ హిట్ ఈ సినిమాకే దక్కింది.ఈ సినిమా జోరు చూస్తుంటే.. ఈ సినిమా ముందు ముందు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సంచలనాలకు వేదికగా నిలుస్తుందో చూడాలి. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు సోల్డ్ అయిపోయాయి. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 15 కోట్లకు  తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం దాదాపు రూ. 5 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x