సంజయ్‌దత్ బయోపిక్‌ టైటిల్ ఏమిటి..!

Last Updated : Oct 7, 2017, 04:12 PM IST
సంజయ్‌దత్ బయోపిక్‌ టైటిల్ ఏమిటి..!

బాలీవుడ్‌ కథానాయకుడు సంజయ్‌ దత్‌ నిజ జీవిత కథతో వస్తున్న ఒక చిత్రం నిర్మాణదశలో ఉందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ  దర్శకత్వం  వహిస్తున్న ఆ చిత్రంలో సంజయ్‌ దత్‌ పాత్రని రణ్‌బీర్‌ కపూర్‌ పోషిస్తున్నారు. మొన్నటి వరకు ఆ సినిమా టైటిల్ విషయమై అనేక చర్చలు జరిపిన చిత్రబృందం ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ జీవితంలో జరిగిన వివాదాలు ఎలాంటివో మనకు తెలిసినవే. అవే అంశాలను మరింత సినిమాటిక్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నారు మేకర్స్. అందుకే టైటిల్ కూడా పెట్టడానికి సమయం తీసుకున్నారు. ఈ సినిమాకి "సంజూ" అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు వినికిడి. అయితే ఇంకా నిర్మాతలు ఈ విషయం బహిర్గతం చేయలేదు. సంజయ్‌‌దత్‌ బయోపిక్‌లో పరేశ్‌ రావల్‌, మనీషా కోయిరాల కూడా నటిస్తున్నారు. వీరు సంజయ్ దత్ తల్లిదండ్రులైన సునిల్‌ దత్‌, నర్గీస్‌ పాత్రలను పోషించనున్నారు. సోనమ్‌ కపూర్‌, దియా మీర్జా, అనుష్కా శర్మలు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని 2018లో మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారని సమాచారం. 

Trending News