Tollywood most profitable movies: టాలీవుడ్‌లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రాలు.. హనుమాన్ ప్లేస్ ఎక్కడంటే..

Tollywood most profitable movies: 2024 యేడాది హనుమాన్ మూవీ ముందు నుంచి అంచనాలతో విడుదలై మంచి విజయమే సాధించింది. ఓవరాల్‌గా తెలుగులో థియోట్రికల్‌గా  అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 5లో నిలిచింది. Tollywood most profitable movies: 2024 యేడాది హనుమాన్ మూవీ ముందు నుంచి అంచనాలతో విడుదలై మంచి విజయమే సాధించింది. ఓవరాల్‌గా తెలుగులో థియోట్రికల్‌గా  అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 5లో నిలిచింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 29, 2024, 08:17 PM IST
Tollywood most profitable movies: టాలీవుడ్‌లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రాలు.. హనుమాన్ ప్లేస్ ఎక్కడంటే..

Tollywood Most Collection Movies: బిందువు, బిందువు కలిపి సింధువుగా మారినట్టు.. మాములు చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ మూవీ ఇపుడు టాలీవుడ్‌లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు పోటీలో బడా హీరోలున్న తొక్కుకుంటూ వెళ్లి విజేతగా నిలిచింది. హను మాన్ అనే బ్రాండ్ నేమ్‌తోనే అన్ని రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా తెలుగులో అత్యధిక థియేట్రికల్ లాభాలు తీసుకొచ్చిన చిత్రాల్లో 4వ ప్లేస్‌లో నిలిచింది. ఇక సంక్రాంతి సీజన్‌లో ఇప్పటి వరకు అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల 'అల  వైకుంఠపురములో' అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి చిత్రంగా నిలిచింది. తాజాగా హనుమాన్ మూవీ 'అల వైకుంఠపురములో' లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను క్రాస్ చేయనుంది. అంతేకాదు హనుమాన్ మూవీ థియేట్రకల్‌గా చాలా తక్కువ రేటుకే అమ్ముడు పోయింది. కానీ వసూళ్లు మాత్రం అమ్మిన రేటు కంటే 5 రెట్లు లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు ఈ మూవీ థియేట్రికల్‌గానే రూ. 100 కోట్లకు పైగా లాభాను తీసుకొచ్చింది. తాజాగా టాలీవుడ్‌లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే..

1.బాహుబలి 2 : రూ. 508 కోట్ల లాభాలు (రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది)
2.బాహుబలి 1 : 186 కోట్ల లాభాలు (రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
3.RRR : రూ. 163.03 కోట్ల లాభాలు (రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
4.హనుమాన్ : రూ. 111 కోట్ల లాభాలు (రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
5.అల వైకుంఠపురములో : రూ. 75.88 కోట్ల లాభాలు (రూ. 84.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
6. గీతా గోవిందం : రూ. 55.43 కోట్లా లాభాలు (రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
7.F2 (Fun Fustration) : రూ. 50 కోట్ల లాభాలు (రూ. 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
8. వాల్తేరు వీరయ్య : రూ. 48.85 కోట్ల లాభాలు (రూ. 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
9. రంగస్థలం : రూ. 47.52 కోట్ల లాభాలు (రూ. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
10. కార్తికేయ 2: రూ. 45.60 కోట్ల లాభాలు (రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
11.పుష్ప 1 :  రూ. 39.72 కోట్ల లాభాలు (రూ. 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
12. సరిలేరు నీకెవ్వరు : kp. 39.36 కోట్ల లాభాలు (రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)

మొత్తంగా హనుమాన్ మూవీ విడుదలైన 17 రోజుల్లోనే దాదాపు రూ. 111 కోట్ల షేర్ లాభాలతో టాప్ 4లో ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత నిలిచి రికార్డు నెలకొల్పింది. అయితే టాప్ 10లో టాప్ 3లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు ఉండటం విశేషం.

ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..

ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News