Prema Desam Movie Review : ప్రేమ దేశం రివ్యూ.. ప్లెజెంట్‌గా సాగే ప్రేమకథలు

Prema Desam Movie Review ప్రేమ దేశం మూవీ కోలీవుడ్, టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచింది. అలాంటి సినిమా టైటిల్‌ను మళ్లీ వాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ శ్రీకాంత్ సిద్దం అనే దర్శకుడు ఇప్పుడు ప్రేమ దేశం అనే టైటిల్‌తో వచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 01:19 PM IST
  • థియేటర్లోకి వచ్చిన ప్రేమ దేశం
  • చాలా ఏళ్లకు తెలుగులో మధుబాల
  • ప్రేమ దేశం కథ, కథనాలు ఏంటంటే?
Prema Desam Movie Review : ప్రేమ దేశం రివ్యూ.. ప్లెజెంట్‌గా సాగే ప్రేమకథలు

Prema Desam Movie Review ప్రేమ కథలకు ఆడియెన్స్ ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. ప్రతీ సినిమాలో ప్రేమ కథ అనేది ఉంటుంది. ప్రేమ కథలే మెయిన్ ప్లాట్‌గా తీసుకుని చేసే సినిమాలుంటాయి. ఇలా ప్యూర్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక లవ్ స్టోరీల్లో ప్రేమ దేశం సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి క్లాసిక్ సినిమా టైటిల్‌తో మళ్లీ తెలుగులో ప్రేమ దేశం అనే సినిమా వచ్చింది. శ్రీకాంత్ సిద్దం దర్శకత్వంలో, శిరీష సిద్దం నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఏంటో ఓ సారి చూద్దాం.

కథ
కాలేజ్‌లో జూనియర్ అయిన ఆద్య (మేఘా ఆకాష్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు అర్జున్ (త్రిగుణ్). ఇక ఈ ప్రేమ విషయంలో అర్జున్ తల్లి మధుమతి (మధుబాల) ఫుల్లుగా సపోర్ట్ చేస్తుంది. ఆద్యతో మధుమతి కూడా పరిచయం పెంచుకుంటుంది. అలా ఈ ఇద్దరి ప్రేమ కథ సాఫీగా సాగుతుంటుంది. చివరకు ప్రేమ విషయాన్ని చెప్పే సమయంలో ఆద్యను కాపాడబోయి త్రిగుణ్‌ ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. ఆ యాక్సిడెంట్ చేసిన మాయ (మాయ) ఎవరు? ఆమె భర్త శివ (శివ) పాత్ర ఏంటి? ఈ కథలో రిషి (బిగ్ బాస్ అజయ్) కారెక్టర్ ఏంటి? చివరకు ఆద్య, అర్జున్ కథ ఏమైంది? అనేది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
కాలేజ్ కుర్రాడిగా, ప్రేమికుడిగా అర్జున్ పాత్రలో త్రిగుణ్‌ మెప్పిస్తాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇక మేఘా ఆకాష్ అయితే యూత్‌కు ఇట్టే నచ్చేస్తుంది. మధుబాల చాలా రోజులకు తెలుగులో కనిపించింది. ఆమె పాత్రతో ఇప్పటి తరం ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇక మాయ పాత్రలో నటించిన మాయ అందంగా కనిపిస్తుంది. శివ కూడా బాగానే నటించాడు. వైష్ణవీ చైతన్య ఉన్నంతలో బాగానే మెప్పిస్తుంది. బిగ్ బాస్ అజయ్ చేసిన రోల్‌ బాగుంది. చక్కగా నటించి ప్రేక్షకులకు దగ్గరవుతాడు. మిగిలిన పాత్రలు కూడా బాగానే గుర్తుండిపోతాయి.

విశ్లేషణ
ప్రేమ కథలు ప్రేక్షకులకు ఎప్పుడూ బోర్ కొట్టవు. కానీ వాటిని తెరకెక్కించిన విధానం మీదే విజయం ఆధారపడి ఉంటుంది. ప్రేమ దేశం టైటిల్ పెట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడతాయి. కానీ క్లాసిక్‌గా నిలిచిన ప్రేమ దేశం సినిమాను గానీ, ఆ టైటిల్‌ను మ్యాచ్ చేసే స్టోరీ, స్క్రీన్ ప్లే గానీ ఇక్కడ కనిపించకపోవచ్చు. ఆ విషయంలో ప్రేక్షకులు కాస్త నిరాశ పడతారేమో.

కానీ దర్శకుడు పాత్రలను మలిచిన తీరు, ముందుకు తీసుకెళ్లే విధానం బాగుంటుంది. ముందు వెనక్కి వెళ్తూ ఉండే స్క్రీన్ ప్లే కనెక్ట్ అవుతుంది. ప్రేమలోని ఎమోషన్‌ను చూపించే ప్రయత్నం చేశారు. అయితే కథ, కథనంలో నెమ్మదనం అందరినీ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమా సెకండాఫ్ మరింత స్లోగా సాగినట్టు కనిపిస్తుంది. మణిశర్మ అందించిన పాటలు, ఇచ్చిన ఆర్ఆర్ బాగుంది. కెమెరా వర్క్ మెప్పిస్తుంది. అంతా కలర్ ఫుల్‌గా చూపించారు. మాటలు గుర్తుండిపోతాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ చక్కగా కుదిరాయి.

Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News