Vaishnav tej: ఉప్పెనంత విజయంతో బిజీగా మారిపోయిన వైష్ణవ్ తేజ్

Vaishnav tej: ఉప్పెన నిజంగానే ఉప్పెనంత విజయాన్ని మూటగట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతో ఆరంగేట్రం చేసిన హీరో, హీరోయిన్లకు ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 5, 2021, 06:46 PM IST
Vaishnav tej: ఉప్పెనంత విజయంతో బిజీగా మారిపోయిన వైష్ణవ్ తేజ్

Vaishnav tej: ఉప్పెన నిజంగానే ఉప్పెనంత విజయాన్ని మూటగట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతో ఆరంగేట్రం చేసిన హీరో, హీరోయిన్లకు ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

కరోనా మహమ్మారి కారణంగా ధియేటర్లు, షూటింగ్‌లు ఆగిపోయిన ఇబ్బందుల్లో పడిన టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీకు ఉప్పెన సినిమా ( Uppena movie) నిజంగానే ఓ బూస్టప్. ఉప్పెనంత కలెక్షన్లతో భారీ విజయం సాధించింది సినిమా. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) సోదరుడు వైష్ణవ్ తేజ్, కన్నడ భామ కృతిశెట్టి తెలుగులో ఆరంగేట్రం చేశారు. సినిమా బంపర్ హిట్ కావడంతో హీరో హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. హీరోగా నటించిన వైష్ణవ్ తేజ్ అయితే ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టేశాడు. రకుల్ ప్రీత్..హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇక అర్జున్ రెడ్డి సినిమాను తమిళలో తెరకెక్కించిన దర్శకుడు గిరీసాయతో వైష్ణవ్ తేజ్(Vaishnav tej) మరో సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో షుూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఇక సుకుమార్ (Sukumar) ఆద్వర్యంలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమా ప్రకటించాడు. ఈ సినిమాను అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నిర్మిస్తున్నారు. మరోవైపు ఛలో, భీష్మ దర్శక ఫేమ్ వెంకీ కుడుముల సైతం వైష్ణవ్ తేజ్‌తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి ఉప్పెనంత విజయంతో వైష్ణవ్ బిజీగా మారిపోయాడు.

Also read: Ravi Teja: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ Khiladiకి కరోనా దెబ్బ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News