Urvashi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా...ఇజ్రాయెల్(Israel)లో జరగనున్న మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది. భారత్ తరఫున ఈ వేడుకకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్న అతిపిన్నవయస్కురాలు ఊర్వశి కావడం విశేషం. 2015 మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరుపున పాల్గొన్న ఈ అమ్మడు..తిరిగి అదే వేదికపైకి న్యాయనిర్ణేతగా రావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ మిస్ యూనివర్స్ 70వ ఎడిషన్‌లో మన దేశం తరుపున హర్నాజ్ సంధు(Harnaaz Sandhu) ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ పోటీలు డిసెంబరు 12న ఇజ్రాయెల్ లోని ఈలాట్(Eilat) జరుగుతాయి. ఈ కార్యక్రమం 172 దేశాల్లో ప్రసారం చేయబడుతోంది.
Also Read: Kim Sharma: వైరల్ ఫొటోస్.. బాయ్‌ఫ్రెండ్‌తో గోల్డెన్ టెంపుల్ వెళ్లిన యువరాజ్ మాజీ ప్రేయసి!!
డిసెంబరు 12న జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఈ మద్దుగుమ్మ ఇజ్రాయెల్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆమెను ఆ దేశ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తన ఇంటికి ఆహ్వానించారు. ఆమెతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా...బెంజిమిన్ కుటుంబానికి భగవద్గీత(Bhagavad Gita)ను అందించారు ఊర్వశి. అంతేకాదూ రెండు, మూడు హిందీ పదాలను కూడా నేర్పించిందట! దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఊర్వశి.. 'బ్లాక్‌రోజ్' సినిమా సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook