Usha Uthup - Padma Bhushan: హస్కీ సింగర్‌కు పద్మభూషణ్.. ఉషా ఉతుప్‌కు కేంద్రం మూడో అత్యున్నత పురస్కారం..

Usha Uthup - Padma Bhushan: కేంద్రం ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులను ప్రకటిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది పలు రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్రం. అందులో సినీ రంగం నుంచి వైజయంతిమాల బాలి, చిరంజీవిలకు పద్మవిభూషణ్‌తో గౌరవిస్తే.. మిథున్ చక్రబర్తి, ఉషా ఉతుప్‌లకు కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 26, 2024, 01:15 PM IST
Usha Uthup - Padma Bhushan: హస్కీ సింగర్‌కు పద్మభూషణ్.. ఉషా ఉతుప్‌కు కేంద్రం మూడో అత్యున్నత పురస్కారం..

Usha Uthup: కీచురాళ్లు.. గొంతు చించుకున్న కీచురాళ్లు అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన గొంతు ఆమెది. అటు భారతీయ ప్రేక్షకులకు భాషా భేదం లేకుండా తన హస్కీ వాయిస్‌తో మంత్ర ముగ్దలును చేసిన ఆ గొంతు ఉషా ఉతుప్ ది. తాజాగా ఈమెకు కేంద్రం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో గౌరవించింది.

ఉషా ఉతుప్ విషయానికొస్తే.. భారతీయ సంప్రదాయ సంగీతానికి పాశ్చాత్య సంగీతాన్ని ఒంటి పట్టించుకున్న అరుదైన గాయనిమణుల్లో ఉషా ఒకరు. ముఖ్య జాజ్ సంగీతంలో ఈమెకు లబ్ద ప్రతిష్ఠురాలు. సినిమా పాటలతో పాటు సంగీత ప్రదర్శనల్లో ప్రైవేట్ సాంగ్స్‌తో ఉర్రూత లూగించారు. ఈమె 1947 నవంబర్ 8న ముంబైలోని తమిళ ఫ్యామిలీలో జన్మించారు. ఈమె అసలు పేరు ఉషా అయ్యార్. తొమ్మిదేళ్ల చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతంలో తొలి ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హిందీ, బెంగాలి,తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్,తమిళం, కన్నడ తదిరత 15 పైగా భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోను పాడారు.

తెలుగులో 'కీచురాళ్లు', తిక్క, ఆహా కళ్యాణం,  చిత్రం భళారే విచిత్రం, రేసు గుర్రం వంటి సినిమాల్లో తన గాత్రంతో మాయ చేసింది. ఈమె గాయనిగా కాకుండా నటిగా ప్రేక్షకులకు సుపరిచితమే. కేరళ చిత్రం 'పోతన్ వావా'లో వెండితెరపై మెరిసారు. ఇక తొలి హిందీ చిత్రం 'బాంబే టూ గోవా'లో పాట పాడటమే కాకుండా అందులో నటించారు. ఇక అమితాబ్ నటించిన 'షాన్' సినిమాలోని టైటిల్ సాంగ్ ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అనేక హిందీ చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసారు. అటు తమిళం, కన్నడలో కూడా సిల్వర్ స్క్రీన్ పై అలరించారు. 2011లో కేంద్రం ఈమెను పద్మశ్రీతో గౌరవిస్తే.. తాజాగా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందుకోనున్నారు.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News