Vadinamma Sujitha Dhanush : స్టైలీష్ లుక్కులో వదినమ్మ.. వెకేషన్లో సుజిత.. పిక్స్ వైరల్

Vadinamma Serial Sujitha Dhanush వదినమ్మ సీరియల్ ద్వారా సుజిత ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 01:19 PM IST
  • బుల్లితెరపై సుజిత మార్క్
  • వదినమ్మగా తెలుగు తెరపై క్రేజ్
  • నెట్టింట్లో సుజిత ఫోటోలు వైరల్
Vadinamma Sujitha Dhanush : స్టైలీష్ లుక్కులో వదినమ్మ.. వెకేషన్లో సుజిత.. పిక్స్ వైరల్

Sujitha Dhanush Pics :  బుల్లితెర తారలకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. వెండితెరపై హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో.. బుల్లితెర తారలకు సోషల్ మీడియాలో అంతే స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. కరోనా సమయంలో బుల్లితెర తారలే ఎక్కువగా సందడి చేశారు. సినిమా షూటింగ్లన్నీ మూతపడ్డా కూడా.. బుల్లితెరపై సీరియల్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజులకు సీరియల్ షూటింగ్లు కూడా ఆగిపోయాయి. 

అయితే బుల్లితెర తారలు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో వదినమ్మ సీరియల్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకునే ప్రభాకర్, సుజితల కాంబోలో ఈ వదినమ్మ సీరియల్ మంచి రేటింగ్‌లతో దూసుకుపోతోంది.

వదినమ్మ సీరియల్‌తో సుజిత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సీత పాత్రలో వదినమ్మగా సుజిత అందరినీ మెప్పించేసింది. తెలుగింటి ఆడపడుచులా సుజిత మారిపోయింది. అంతకు ముందు అయితే కలవారి కోడలు అనే సీరియల్‌తో నాటి ప్రేక్షకులను అలరించింది సుజిత.

సుజిత చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ తెలుగు వారికి పరిచయమే. చిరంజీవి సినిమాతో సుజిత ఎంట్రీ ఇచ్చింది. పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. మళ్లీ తరువాత జై చిరంజీవి సినిమాలో చిరంజీవి చెల్లిగానూ నటించేసింది. అలా వెండితెరపై సుజిత సందడి చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మాత్రం బుల్లితెరపై సుజిత సందడి చేస్తోంది. వదినమ్మగా టీఆర్పీలో టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే సుజిత మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అలా నెట్టింట్లో సుజిత ఫోటోలు వైరల్ అవుతుంటాయి.

బుల్లితెరపై ఎక్కువగా చీరకట్టులో కనిపించే సుజిత.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షాక్ ఇస్తుంటుంది. మోడ్రన్ దుస్తుల్లో కనిపించి ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా సుజిత వెకేషన్లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను షేర్ చేసింది. ఇందులో మోడ్రన్ లుక్కులో కనిపించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి.

Trending News