Vijay Varasudu Trailer : వారసుడు ట్రైలర్.. వంశీ పైడిపల్లిపై ట్రోలింగ్.. ఆ సినిమాలన్నీ కలిపి కొట్టేశాడట

Trolls On Vijay Varasudu Trailer వంశీ పైడపల్లి సినిమాలేవీ కూడా కొత్తగా ఉండవు. పాత కథలను తీసుకుని వాటికి కొత్త రంగులు అద్దుతుంటాడు. ఇప్పుడు ఓ ఐదారు తెలుగు సినిమాలను కలిసి విజయ్‌తో వారసుడు అని తీశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 02:30 PM IST
  • నెట్టింట్లో వారసుడు ట్రైలర్ సందడి
  • తెలుగు సినిమాల పోలికలతో సెటైర్లు
  • ఐదారు సినిమాలు కలిపి కొట్టేశాడా?
Vijay Varasudu Trailer : వారసుడు ట్రైలర్.. వంశీ పైడిపల్లిపై ట్రోలింగ్.. ఆ సినిమాలన్నీ కలిపి కొట్టేశాడట

Trolls On Vijay Varasudu Trailer వంశీ పైడిపల్లి తీసిన బృందావనం, ఎవడు, మహర్షి ఇలా ఏ సినిమా చూసినా గతంలో ఎక్కడో చోట చూసినట్టుగా అనిపిస్తుంది. అలా పాత కథలకు కాస్త రంగులద్దేస్తుంటాడు. అయితే పాత కథలకు కాస్త ఈ తరం ఆలోచనలు యాడ్ చేసి గ్రాండ్‌గా తెరకెక్కిస్తుంటాడు వంశీ పైడిపల్లి. అలా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయినా కూడా నిర్మాతలకు మాత్రం లాభాలను తెచ్చిపెట్టేలా ఉండవు.

 

ఇప్పుడు విజయ్ వారసుడు సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. ఇది పక్కా తమిళ్ సినిమా అని ఇన్ని రోజులు ఊదరగొట్టేశారు. కానీ సినిమా ట్రైలర్ చూసిన తెలుగు ఆడియెన్స్ తెగ నవ్వేసుకుంటున్నారు. ఇది పక్కా తెలుగు సినిమా కదా? ఇందులో ఎన్నో తెలుగు సినిమా చాయలున్నాయని, అన్నింటిని కలిపి కొట్టేశాడంటూ వంశీ పైడిపల్లిని ఆడేసుకుంటున్నారు.

 

వారసుడు ట్రైలర్ చూస్తుంటే లక్ష్మీ, మహర్షి, శ్రీమంతుడు, అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం ఇలా అన్ని సినిమాలు గుర్తుకు వస్తున్నాయని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కథను ముందుగా మహేష్ బాబుకు వినిపించాడని దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కథను మహేష్ చేయకపోవడమే చాలా మంచిది అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.  

 

వారసుడు పరమ రొటీన్‌గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తూనే అర్థమవుతోంది. ముగ్గురు కొడుకులు.. మధ్యలో గొడవలు.. దూరం చేసే ఓ విలన్.. కాపాడే చిన్న తమ్ముడు.. ఉమ్మడిగా ఉంచేందుకు చేసే ప్రయత్నాలు.. ఇలాంటి నాటు కొట్టుడు కథలు, సినిమాలను మన తెలుగు వాళ్లు ఇది వరకే ఎన్నో చూసి ఉన్నారు. మరి ఈ వారసుడు సినిమా ఎలాంటి టాక్‌ను తెచ్చుకుంటుందో చూడాలి.

కనీసం తమిళంలో అయినా ఈ సినిమా క్లిక్ అయితే కాసుల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తోంది. ఓపెనింగ్స్ అయితే భారీగా వస్తాయి. ఆ తరువాత టాక్‌ను బట్టి తెలుగులో కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. ఈ సినిమా కోసం దిల్ రాజు అనుకున్న బడ్జెట్‌ పెరిగిందట. మరి అది రికవరీ అవుతుందా? లేదా? అన్నది చూడాలి

Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News