Allari Naresh: సంక్రాంతి సీజన్ గడిచిన తర్వాత టాలీవుడ్ లో తిరిగి సినిమాల సందడి కనిపించడం లేదు. ఫిబ్రవరి సినిమాలలో ఏదీ కూడా సినీ ప్రేక్షకులకు అనుకున్న సంతృప్తి ఇవ్వలేకపోయాయి. చిన్న సినిమాలు చాలా విడుదల అయినప్పటికీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన అంబాజీపేట మ్యారేజీబ్యాండు, ఈగల్, ఊరు పేరు భైరవకోన చిత్రాలు అనుకున్న రేంజ్ వసూలు రాబట్ట లేకపోయాయి.
దీంతో సినీ లవర్స్ ఫోకస్ మొత్తం ప్రస్తుతం మార్చి నెల పై పడింది. క్రేజీ సినిమాలు వరుసగా విడుదల కావడంతో మార్చి నెలలు థియేటర్లలో సందడి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఈనెల ఏకంగా ముగ్గురు హీరోలు తమ కమ్ బ్యాక్ కోసం థియేటర్లలోకి వస్తున్నారు.ఆపరేషన్ వాలెంటైన్ తో వరుణ్ తేజ్, భీమ తో గోపీచంద్, ఆ ఒక్కటి అడక్కు తో అల్లరి నరేష్ తమ లక్ ట్రై చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ముగ్గురు హీరోల కెరీర్లకు ఈ చిత్రాలు ఎంతో కీలకం. ఈ సినిమాలలో ఏది తేడా పలికినా అది వారి కెరీర్‌కు పెద్ద ఇబ్బందిగా మారుతుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకప్పుడు ఫిదా, తొలిప్రేమ, ఎఫ్-2 లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే గత రెండేళ్లుగా అతనికి ఏ సినిమాలు సరిగా కలిసి రావడం లేదు. గని, ఎఫ్-3, గాండీవధారి అర్జున.. ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన అన్ని చిత్రాలు వరుస డిజాస్టర్స్ గా మిగిలాయి. దీంతో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆపరేషన్ వాలెంటైన్ హిట్ కావడం చాలా అవసరం.మార్చి 1న విడుదల కాబోతున్న ఈ మూవీ కి హైప్ తక్కువగానే ఉంది. అసలు ఈ సినిమా హిట్ అవుతుందా అనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే చిత్ర బంధం మాత్రం మూవీ కంటెంట్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఇక టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ ‘భీమ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత ఏడాది అతను నటించిన రామబాణం చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. గోపీచంద్ మార్క్ పక్క మాస్ మసాలా మూవీ కావడం తో భీమ క్లియర్ హిట్ అవుతుంది అని అందరూ ఆశిస్తున్నారు. మరోపక్క అల్లరి నరేష్ కూడా ఈసారి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి ఫిక్స్ అయిపోయాడు. గత కొద్ది కాలంగా సీరియస్ పాత్రలు చేస్తున్న అల్లరి నరేష్ తిరిగి తన అల్లరి మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో మంచి కామెడీ ఓరియంటెడ్ ఆ ఒక్కటి అడక్కు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ తనకు పూర్వ వైభవం తెస్తుందని అల్లరి నరేష్ గట్టి నమ్మకం. మరి ఈ మొక్కలు హీరోల్లో ఎవరు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారో వేచి చూడాలి.
Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్
Also Read: VIPs Drivers: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రముఖుల డ్రైవర్లకు 'ఫిట్‌నెస్ టెస్టులు'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి