OMG Movie Review: వెన్నెల కిషోర్ 'ఓ మంచి ఘోస్ట్' రివ్యూ.. భయపెడుతూ నవ్వించారే..

OMG Movie Review: వెన్నెల కిషోర్ కమెడియన్ గానే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా సత్తా చూపెడుతున్నాడు. తాజాగా వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'OMG' (ఓ మంచి ఘోస్ట్). ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 21, 2024, 03:33 PM IST
OMG Movie Review: వెన్నెల కిషోర్ 'ఓ మంచి ఘోస్ట్' రివ్యూ.. భయపెడుతూ నవ్వించారే..

రివ్యూ: OMG (ఓ మంచి ఘోస్ట్)
నటీనటులు: వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందిత శ్వేత, నాగినీడు, నవీన్ నేని, రజత్ రాఘవ్, తదితరులు..
సంగీతం: అనూప్ రూబెన్‌స్
సినిమాటోగ్రఫీ: ఆండ్రూ బాబు
ఎడిటర్: ఎం.ఆర్. వర్మ
నిర్మాత: అభినిక ఇనబర్తుని
దర్శకత్వం: శంకర్ మార్తాండ్

వెన్నెల కిషోర్, నందితా శ్వేతా. నవమి గాయక్, షకలకశంకర్, రజత్ భార్గవ్ ముఖ్యపాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'OMG' (ఓ మంచి ఘోస్ట్). డాక్టర్ అబినికా ఇనాబతుని నిర్మాణంలో మార్క్ సెట్ నెట్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. శంకర్ మార్తాండ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
అనగనగా ఓ ఊరు. ఆ ఊరు చివరన పాడుపడిన ఓ మహల్ ఉంటుంది. అందులో ఓ వింత దెయ్యం ఉంటుంది. దానికి కిడ్నాప్ గ్రటా అంటే పడవు. కట్ చేస్తే రజియా (నవమి గాయక్), చైతన్య (రజత్), లక్షణ్ (నవీన్), పావురం (షకలకా శంకర్ ) డబ్బు కోసం తిప్పలు పడుతుంటారు. అంతేకాదు ఈజీగా డబ్బు సంపాదించాలంటే కిడ్నాప్ ఒక్కటే మార్గమని అనుకుంటారు. ఈ క్రమంలో అనుకున్నదే తడువుగా ఆ ఊరు ఎమ్మెల్యే సదాశివరావు (నాగినీడు) కూతురు కీర్తి (నందితా శ్వేత)ను కిడ్నాప్ చేస్తారు. అంతేకాదు ఆమెను ఊరు అవతల ఉన్న దెయ్యం ఉంటున్న మహల్ కు తీసుకెళ్లి దాచిపెడతారు. ఇక అక్కడ కిడ్నాప్ అంటేనే పడని దెయ్యం ఈ కిడ్నాపర్లను ఏం చేసింది. మరోవైపు కీర్తి వింత వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. చివరకు ఈ దెయ్యం మహల్ లో చిక్కుకున్న కిడ్నాపర్లను ఆ దెయ్యంతో పాటు వింత వ్యాధితో బాధపడే కీర్తి ఏం చేసిందనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఒకప్పుడు హార్రర్ చిత్రాలంటనే ప్రేక్షకులకు ఎంతగానే భయపట్టేవి. కొన్ని రోజులు వరకు చూసిన ప్రేక్షకుల మదిలో ఎంత కాలం వెంటాడేవి. రాను రాను ఇలాంటి సీరియస్ కాన్సెప్ట్ హార్రర్ కథలకు చెల్లు చీటి పడింది. క్రమంగా దెయ్యాలతో కూడా కామెడీ చేయించే సరికొత్త టెక్నిక్ మన దర్శకులు పట్టేసారు. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు కనుకగా మేకర్స్ ఆ దిశగానే సినిమాలు నిర్మిస్తున్నారు. అదే హార్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన మూవీనే 'ఓ మంచి ఘోస్ట్'. ఈ సినిమాలో దెయ్యం భయపెడుతూనే నవ్విస్తోంది. ప్రేక్షకులకు ముందుగానే కథలో లీనమయ్యేటట్టు చేసి అందుకు తగ్గ హిల్లేరియస్ సన్నివేశాలను రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొత్తంగా థియేటర్స్ లో ఆడియన్స్ ఆయా సన్నివేశాలకు పడిపడి నవ్వుకోవడం ఖాయం.

అక్కడక్కడ లాజిక్ మిస్ అయినా.. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తోంది. ఇక సెకండాఫ్ లో దెయ్యాలతో చేసే కామెడీ లాజిక్ లేకున్నా… నవ్వుకుంటారు. ఈ సినిమాలో ఫ్లాస్ బ్యాక్ లో వచ్చే సీన్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.
టెక్నికల పరంగా కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఆర్ఆర్ బాగుంది. పాటలు కూడా సోసోగా బాగున్నాయి. కెమెరా వర్క్ బాగుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ బాగుంది. మహల్, ఇతర సెట్స్ బాగున్నాయి. మొత్తంగా తాను చెప్పదల్చుకున్న విషయాన్ని తెరపై ఎక్కడ తడబడకుండా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. మేకింగ్ పరంగా సినిమా బాగుంది.

నటీనటుల విషయానికొస్తే..
వెన్నెల కిషోర్ అంటనే నవ్వుల బాంబ్. ఈ సినిమాలో అది పలుసార్లు పేలింది. ప్రేక్షకులు కూడా వెన్నెల కిషోర్ నవ్వుల బాంబులకు పొట్ట చెక్కలయ్యేలా చేసాడు. షకలక శంకర్ కూడా వెన్నెల కిషోర్ తర్వాత అంతా ప్రేక్షకులు కితకితలు పెట్టాడు.  నందితా శ్వేత సహా ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

వెన్నెల కిషోర్ కామెడీ

ఆర్ఆర్

ఆర్ట్ వర్క్, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్

ఎడిటింగ్

లాజిక్ లేని సీన్స్

రేటింగ్: 2.75/5

Read more: Snakes: వామ్మో..ఇంట్లో బైట పడ్డ 32 పాము పిల్లలు.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News