Dana Toofan: అల్పపీడనం నేటి ఉదయం తుపానుగా, రేపు తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయిన భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోగా ఒడిశాలోని పూరీ , పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటొచ్చని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు. తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఈదురు గాలుల తీవ్రత 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఈ దానా తుపాను తీరం తాకే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నేటి నుంచి నాలుగు రోజులపాటు పశ్చిమ బెంగాల్‌లో.. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒడిశాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండకపోవచ్చు చెబుతున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే దానా బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దీనిపై ఈరోజు క్లారిటీ రానుంది. బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ రేపు ఎల్లుండి తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. వాటిలో దూర ప్రాంత సర్వీసులు సహా దగ్గర సర్వీసులూ ఉన్నాయి. రేపు అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్‌డా, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, పూరీ తదితర ప్రాంతాలనుంచి రాకపోకలు సాగించేవి ఉన్నాయి. విశాఖ-భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ రైలును 24న రద్దు చేశారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter