Vikram Gokhale Death : ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే మరణం

Vikram Gokhale was died in Pune విక్రమ్ గోఖలే మరణ వార్తల మీద వచ్చిన రూమర్లు అందరికీ తెలిసిందే. గత మూడు నాలుగు రోజుల క్రితమే మీడియా తన అత్యుత్సాహంతో విక్రమ్ గోఖలేను చంపేసింది. కుటుంబ సభ్యులు వెంటనే రియాక్ట్ అయి ఆ వార్తలను ఖండించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 04:48 PM IST
  • బాలీవుడ్‌ నటుడు విక్రమ్ గోఖలే మృతి
  • చికిత్స పొందుతూ మరణించిన నటుడు
  • బాలీవుడ్‌ ప్రముఖుల సంతాపం
Vikram Gokhale Death : ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే మరణం

Vikram Gokhale Death : బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే (77) కాసేపటి క్రితం కన్నుమూశారు. పూనె హాస్పిటల్‌లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఉన్న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల బాలీవుడ్ మీడియా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. హాస్పిటల్ బెడ్డు మీద ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నా కూడా మీడియా మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించింది. ప్రాణాలతో ఉన్నా కూడా మరణించినట్టు వార్తలు ప్రచురించింది.

విక్రమ్ గోఖలే కూతురు, భార్య ఇలా అందరూ కూడా ఆ వార్తలను ఖండించారు. ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు.. ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.. కండీషన్ క్రిటికల్‌గా ఉందంటూ చెప్పుకొచ్చారు. కానీ కాసేపటి క్రితం విక్రమ్ గోఖలే కన్నుమూశారు. ఆయన మరణంతో సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విక్రమ్ గోఖలే నాటక రంగం నుంచి బుల్లితెర, వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్ హే రామ్ సినిమాలో మంచి పాత్రను పోషించారు. అమితాబ్ బచ్చన్ అగ్నిపథ్ ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సంజయ్ లీల భన్సాలీ తీసిన హమ్ దిల్ దే చుకే సినిమాలో అద్భుతంగా నటించేశారు.  ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్‌కు సంగీతం నేర్పించే గురువు పాత్రలో కనిపించారు.

నటించడమే కాకుండా విక్రమ్ గోఖలే దర్శకుడిగానూ తన సత్తాను చాటుకున్నారు. మరాఠిలో ఆయన ఆఘట్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. చివరగా మిషన్ మంగళ్ సినిమా, మరాఠిలో వచ్చిన గోదావరిలో ఆయన కనిపించారు.

Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్

Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News