Mihir Das: ఒడిశా చిత్రపరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు మిహిర్ దాస్ కన్నుమూత

Mihir Das: సీనియర్ ఒడియా నటుడు మిహిర్ దాస్(63) మంగళవారం కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 04:06 PM IST
Mihir Das: ఒడిశా చిత్రపరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు మిహిర్ దాస్ కన్నుమూత

Veteran Odia actor Mihir Das dies at 63: సీనియర్ ఒడియా నటుడు మిహిర్ దాస్(63) (actor Mihir Das passed away) కన్నుమూశారు. కొన్నేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కటక్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గతేడాది డిసెంబరు 9న ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయన మృతికి సీఎం నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) సంతాపం తెలిపారు. బుధవారం కటక్‌లో (Cuttack) పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో దాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. దాస్‌కి కొడుకు, కోడలు ఉన్నారు.  అతని భార్య, గాయని, నటి సంగీతా దాస్ 2010లో గుండెపోటుతో మరణించారు.

ఫిబ్రవరి 11, 1959న మయూర్‌భంజ్ జిల్లాలో జన్మించిన దాస్...తొలిసారిగా 'స్కూల్ మాస్టర్' అనే ఆర్ట్ ఫిల్మ్‌లో నటించారు. లక్ష్మీ ప్రతిమ' (Laxmi Pratima) (1998), 'ఫెరియా మో సునా భౌనీ' (2005)లో తన నటనకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. రాఖీ బంధిలి మో రొఖిబొ మొనొ, ప్రేమొ ఒఢెయి ఒక్షొరొ చలన చిత్రాల్లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును ఆయన అందుకున్నారు.'‘ఆశర అలోక'’(Ashara Aloka) అనే రియాల్టీ షోకి హోస్ట్‌గా మెప్పించారు. 2014లో అధికార బిజూ జనతాదళ్‌లో చేరిన దాస్...2019లో బీజేపీలో చేరారు. 

Also Read: Saina Accepted Siddharth Apology: క్షమాపణలు కోరిన హీరో సిద్దార్థ్.. అంగీకరించిన సైనా

మిహిర్ దాస్ మృతి పట్ల ఒడిశా గవర్నర్ గణేశి లాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిబి హరిచందన్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వివిధ రంగాలకు చెందిన ప్రజలు సంతాపం తెలిపారు. మిహిర్‌ దాస్‌ మరణం ఒడియా సినీ రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. అత్యుత్తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మిహిర్‌ దాస్‌ సుస్థిర స్థానం సంపాదించారని ఆ రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసరు గణేషీ లాల్ (Governor Ganeshi Lal) అన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News