Three Heros Missed Sita Ramam: సూపర్ హిట్ సినిమా ‘సీతారామం’ను మిస్ చేసుకున్న హీరోలు వీరే!

Vijay Devarakonda Nani RamPothineni Missed Sita Ramam: దుల్కర్ సల్మాన్ కంటే ముందు సీతారామం సినిమాను ముగ్గురు తెలుగు హీరోలు కాదనుకున్నారట. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 10:52 AM IST
Three Heros Missed Sita Ramam: సూపర్ హిట్ సినిమా ‘సీతారామం’ను మిస్ చేసుకున్న హీరోలు వీరే!

Vijay Devarakonda Nani RamPothineni Missed Sita Ramam: ఆర్ఆర్ఆర్  సినిమా తర్వాత సరైన హిట్ సినిమా లేక ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఆగస్టు నెలలో మూడు హిట్ సినిమాలు లభించాయి. ఆగస్టు 5వ తారీఖున విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. అలాగే ఆగస్టు 13వ తేదీన విడుదలైన కార్తికేయ 2 సినిమా కూడా ఘన విజయాన్ని నమోదు చేసింది.

ఇక సీతారామం సినిమా విషయం మీద ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. రష్మిక మందన, సుమంత్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అశ్వినీదత్ కి సంబంధించిన వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పించిన ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్ మీద స్వప్న దత్ నిర్మించారు. అలాగే ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటుగా సినిమా మీద కురిపిస్తున్న ప్రశంసలు వర్షానికి సినిమా యూనిట్ అయితే ప్రస్తుతం చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే సీతారామం సినిమా కథను దుల్కర్ సల్మాన్ కంటే ముందు మరో ముగ్గురు హీరోలకి చెప్పారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. నిజానికి ముందుగా ఈ సినిమా కథను విజయ్ దేవరకొండకు చెప్పారట హను రాఘవపూడి. అయితే ఈ సినిమా తనకు సెట్ కాదని విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించారట.

ఆ తర్వాత ఈ కథను మరో ఇద్దరు హీరోలు కూడా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. వారిద్దరూ మరెవరో కాదు నాని, రామ్ పోతినేని అని అంటున్నారు. నిజానికి ఇద్దరికీ కూడా హిట్లుగా నిలిచిన మంచి లవ్ స్టోరీలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వారికి లవ్ స్టోరీ సినిమాలు కలిసి రాకపోవడంతో వారిద్దరు కూడా జానర్ మార్చి మాస్ మసాలా మూవీస్ తీసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కథ మాకు కరెక్ట్ కాదని వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారట. అలా మొత్తానికి ముగ్గురు హీరోలను దాటి దుల్కర్ సల్మాన్ వరకు వెళ్ళిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బింబిసార సినిమాను కూడా రవితేజ కాదనుకుంటే కళ్యాణ్ రామ్ వరకు వెళ్లిందనే విషయం కూడా తర్వాత వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Rajinikanth as Governor: గవర్నర్ గా రజనీకాంత్.. ఇక సినిమాలకు బైబై!

Also Read: Shyam Singha Roy In Oscar's: ఆస్కార్ నామినేషన్ రేసులో నాని శ్యామ్ సింగ రాయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News