Krithi Shetty: బేబమ్మతో రొమాన్స్ చేయనన్న విజయ్.. కారణం ఇదే!

Krithi Shetty: తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కృతిశెట్టి ఒకరు. అయితే ఈ బ్యూటీతో రొమాన్స్ చేయనని తెగేసి చెప్పాడట కోలీవుడ స్టార్ హీరో విజయ్ సేతుపతి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2023, 04:55 PM IST
Krithi Shetty: బేబమ్మతో రొమాన్స్ చేయనన్న విజయ్.. కారణం ఇదే!

Krithi Shetty- Vijay Sethupathi: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన కృతి నటించింది. ఇందులో ఈ బ్యూటీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్ల క్యూ కట్టాయి. ఉప్పెన తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వచ్చిపడ్డాయి. ఆ తర్వాత కృతి నటించిన మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. 

కృతి కెరీర్ గాడిన పడాలంటే ఈ బ్యూటీకి సరైన హిట్ పడాలి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒక్కో సినిమాలో నటిస్తుందట. అయితే ఇది వరకు ఓ సినిమాలో కృతి శెట్టితో రొమాన్స్ చేసేందుకు తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నిరాకరించడట. కృతిని వద్దనడానికి కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు విజయ్ సేతుపతి. 
"ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించాను. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నేను తమిళంలో ఓ సినిమాకు సైన్ చేశాను. అందులో నాకు జోడీగా కృతి శెట్టి అయితే బాగుంటుందని మేకర్స్ భావించారట. హీరోయిన్ ఈవిడే అంటూ నాకు తన ఫొటో పంపించారు. అది చూసిన వెంటనే మూవీ యూనిట్‍ను పిలిచి వద్దని చెప్పాను. తండ్రిగా నటించిన ఆమెతోనే రొమాన్స్ చేయడం నాకిష్టం లేదు. అందుకే హీరోయిన్‍గా తనను వద్దని చెప్పాను" అని విజయ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం విజయ్ కెరీర్ మంచి ఊపు మీద ఉంది. కోలీవుడ్ తోపాటు బాలీవుడ్, టాలీవుడ్ లోనూ ఈ నటుడు వరుస చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల జవాన్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ చేసి ఆడియెన్స్ ను మెప్పించాడు విజయ్. ప్రస్తుతం మహారాజ, మేరీ క్రిస్‍మస్, గాంధీ టాక్స్ వంటి సినిమాలు చేస్తున్నాడు. 

Also Read: Oscars 2024: తెలుగు సినిమాలకు మరోసారి నిరాశ... ఆస్కార్ బరిలో మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News