Vikram directs Naga chaitanya : చెర్రీ కాదు చైతూతో..

'మజిలీ' సినిమాతో హిట్ అందుకున్న నాగ చైతన్య .. వరుసగా మరో మూడు ప్రాజెక్టులకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమాలో హీరో నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని సమ్మర్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Last Updated : Mar 4, 2020, 04:40 PM IST
Vikram directs Naga chaitanya : చెర్రీ కాదు చైతూతో..

'మజిలీ' సినిమాతో హిట్ అందుకున్న నాగ చైతన్య .. వరుసగా మరో మూడు ప్రాజెక్టులకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమాలో హీరో నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని సమ్మర్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టులు అక్కినేని నట వారసుని కోసం లైన్‌లో ఉన్నాయి. నాగ చైతన్య..  'బంగార్రాజు', 'నాగేశ్వర రావు' సినిమాల్లో నటించనున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్టుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

Read Also: అందుబాటులోకి వాట్సప్ కొత్త ఫీచర్..!!

మనం సినిమా  దర్శకుడు విక్రమ్ కె కుమార్... 'గ్యాంగ్ లీడర్' తర్వాత మరో చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. ఐతే ఓ స్టోరీ లైన్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు వినిపించాడని తెలుస్తోంది. ఐతే ఆ స్టోరీ చెర్రీకి నచ్చింది. కానీ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో చెర్రీ బిజీగా ఉన్నాడు. దీంతో విక్రమ్ కుమార్ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఐతే ఇప్పుడు అదే ప్రాజెక్టును విక్రమ్ కె కుమార్ నాగ చైతన్యతో చేయాలని డిసైడ్ అయ్యారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాతోపాటు మరో రెండు సినిమాలను ముగించిన తర్వాత వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.  ఆ లోగా విక్రమ్ కె కుమార్ ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

గతంలో 'మనం' సినిమాలో నాగచైతన్య , విక్రమ్ కె కుమార్ కలిసి పని చేశారు. ఆ తర్వాత అక్కినేని మరో వారసుడు అఖిల్ తో దర్శకుడు విక్రమ్ కె కుమార్ 'హలో' సినిమా చేశారు. దీంతో అక్కినేని కుటుంబానికి విక్రమ్ కె కుమార్‌కు  మంచి అనుబంధం ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News