Ratnam: విశాల్ రత్నం నుంచి సాంగ్ రిలీజ్..ఉరకలెత్తించే లిరిక్స్ తో అదిరిపోయిన పాట

Vishal Ratnam: తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు హీరో విశాల్. అందుకే విశాల్ నటించే ప్రతి సినిమా తమిళం తో పాటు తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంటాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 06:09 PM IST
Ratnam: విశాల్ రత్నం నుంచి సాంగ్ రిలీజ్..ఉరకలెత్తించే లిరిక్స్ తో అదిరిపోయిన పాట

Vishal: పందెంకోడి చిత్రంతో తెలుగులో తనకంటూ అభిమానులను సంపాదించుకున్న హీరో విశాల్ ఆ తర్వాత కూడా ఎన్నో హిట్లు అందుకున్నారు.
మాస్ యాక్షన్ హీరో గా పేరుపొందిన ఈ హీరో ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘రత్నం’. ఈ సినిమాకు హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ ఈ చిత్రానికి కో-ప్రోడ్యుసర్. ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం  అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌ ఈ మధ్యనే విడుదల కాగా.. అందరినీ ఆకట్టుకుంది. 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News