Gaami : ఏకంగా ఆ సినిమాతో పోలికపెట్టుకుంటున్న విశ్వక్.. మరి ఎక్కువైనట్టుందిగా!

  Vishwak Sen : కొత్త తరహా సినిమాలు చేయడంలో ముందుండే యువ హీరో విశ్వక్ సేన్. తాజాగా ఈ హీరో ఈ హీరో విద్యాధర్ కాగిత అనే డైరెక్టర్ తో చేతులు కలిపి గామి అనే ఎక్స్పరిమెంటల్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక అఘోర పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ఈ నటుడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2024, 09:53 AM IST
Gaami : ఏకంగా ఆ సినిమాతో పోలికపెట్టుకుంటున్న విశ్వక్.. మరి ఎక్కువైనట్టుందిగా!

Vishwak Sen : యువ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న గామి సినిమా వచ్చే శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. నిన్న మొన్నటిదాకా సినిమా గురించి చాలామందికి తెలియదు కానీ ఈ మధ్యనే విడుదలైన చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమాపై మంచి అంచనాలను కూడా పెంచింది. 

ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి ఈ విధంగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక అఘోరా పాత్రలో కనిపించబోతున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉండిపోయిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కి సిద్ధం అయింది. నిజానికి విశ్వక్ సేన్ తన కరియర్ ప్రారంభంలో ఒప్పుకున్న సినిమా ఇది. కానీ విడుదల అవ్వడానికి ఇంతకాలం పట్టింది. అయితే విశ్వక్ సేన్ కి ఇప్పుడు ఉన్న ఇమేజ్ ..మార్కెట్ ఈ సినిమాకి బాగా సహాయపడతాయని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. 

డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ కచ్చితంగా విశ్వక్ సేన్ కరియర్ లోనే ఛాలెంజింగ్ పాత్రగా మారబోతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశ్వక్ సేన్ ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రేంజ్ టేకింగ్ ఈ సినిమాలో కూడా ఉంటుందని అన్నారు.

సినిమాపై ఎంత నమ్మకం ఉన్నప్పటికీ విశ్వక్ క్రిస్టోఫర్ నోలన్ వంటి పెద్ద డైరెక్టర్ తో తన సినిమాను పోల్చుకోవటం రిస్క్ అవుతుంది ఏమో అని అభిమానులు కంగారుపడుతున్నారు. ఓపెన్ హేమర్, టెనట్ వంటి క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు చాలా వరకు సామాన్య ప్రజలకు అర్థం కూడా కావు. కానీ ఫిలిం మేకింగ్ ను ఇష్టపడే వారికి ఆ సినిమాలు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నోలన్ సినిమాలు నచ్చుతాయి. 

కానీ గామి సినిమా అలా కాదు. సినిమాకి పెట్టిన బడ్జెట్ వెనక్కి రావాలి అంటే సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగేలా ఉండాలి. ఆర్ ఆర్ ఆర్, కార్తికేయ 2 లాంటి సినిమాల లాగా యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాలి. చిత్ర బృందం సినిమాని కమర్షియల్ ప్యాకేజీ గానే ప్రమోట్ చేస్తోంది. గామి లాంటి డివోషనల్ థ్రిల్లర్  సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మరి ఈ సినిమా హిట్ అయ్యి ఇలాంటి మరికొన్ని సినిమాలకు మార్గదర్శకంగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!

Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News