Dhamaka OTR Release: ఇక ఓటీటీలో ధమాకా సృష్టించనున్న మాస్ మహారాజా రవితేజ, ఎప్పుడంటే

Dhamaka OTR Release: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్. బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన రవితేజ సినిమా థమాకా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడు, ఎందులో అనే వివరాలు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 14, 2023, 01:00 PM IST
Dhamaka OTR Release: ఇక ఓటీటీలో ధమాకా సృష్టించనున్న మాస్ మహారాజా రవితేజ, ఎప్పుడంటే

థియేటర్ రిలీజ్‌లో సక్సెస్ సాధించిన రవితేజ తాజా సినిమా థమాకా త్వరలో ఆన్‌లైన్‌లో హంగామా చేయనుంది. ఓటీటీ స్ట్రీమింగ్‌కు ముహూర్తం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో థమాకా స్ట్రీమ్ కానుంది. ఆ వివరాలు మీ కోసం..

టాలీవుడ్ మాస్ మహారాజా ప్రస్తుతం మెగాస్టార్ చిరుతో కలిసి వాల్తేరు వీరయ్యలో సందడి చేస్తున్నాడు. హిట్ టాక్ తెచ్చుకున్న వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమా కంటే కొద్దిరోజుల ముందు విడుదలైన రవితేజ తాజా సినిమా థమాకా అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. భారీ కలెక్షన్లతో రికార్డు సృష్టించింది. థియేటర్ రిలీజ్ సక్సెస్ కావడంతో ఇప్పుడిక ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సిద్ధమౌతోంది. దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేయాలనేది నిర్ణయమైపోయింది. 

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన థమాకా సినిమా ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది. మాస్ అండ్ సాలిడ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. కలెక్షన్లు కూడా బాగున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా  ఈ సినిమాను నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా అలరించింది. భీమ్స్ సిసిలియో సంగీతం ఆకట్టుకుంది. డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా సక్సెస్ కావడంతో థియేటర్ రిలీజ్ ఎప్పుడా అని రవితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన పరిస్థితి ఉంది. ఇప్పుడా అభిమానులకు ఆనందం కలిగిస్తూ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. 

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ధమాకా సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది. జనవరి 22వ తేదీన స్ట్రీమింగ్ చేయనుంది. ఈ తేదీ ఖరారైనా..అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కన్పిస్తాడు. బిజినెస్ మ్యాన్‌గా, కామన్ మ్యాన్‌గా నటించాడు. కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఇప్పటికే వందకోట్ల క్లబ్‌లో చేరిపోయింది. శ్రీలీల గ్లామర్ సినిమాకు ప్లస్ అయిందనేది ఓ టాక్. ధమాకా సినిమాలో రవితేజ యాక్టింగ్, కామెడీ టైమింగ్ చూసి మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కేకలెట్టారు. శ్రీలీల డ్యాన్స్ కోసం ఎగబడుతున్నారు. 

Also read: Adipurush Movie: ఆదిపురుష్ సినిమా చుట్టూ వివాదం, హిందూవుల మనోభావాలు దెబ్బతీసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News