TFI Heroines: హీరోయిన్లను ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా? లేక హీరోయిన్లే ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదా..?

Tollywood Heroines: తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు సీఎం రేవంత్ రెడ్డితో..భేటీ అయ్యారు. దాదాపు 36 మంది ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఒక్క లేడీ సెలబ్రిటీ.. కూడా కనిపించకపోవడం గమనార్హం. ఎక్కడ చూడు అమ్మాయిలదే పై చేయి అని చెప్పే మన సమాజంలో.. సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన విషయాల్లో మాత్రం అసలు హీరోయిన్స్ ఉసే లేకపోవడం అందరిని ఆశ్చర్యపరస్తోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 26, 2024, 02:28 PM IST
TFI Heroines: హీరోయిన్లను ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా? లేక హీరోయిన్లే ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదా..?

Tollywood Heroines: సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. అయితే సినిమాలు సక్సెస్ కావాలి అంటే కచ్చితంగా హీరో, హీరోయిన్ ఉండాల్సిందే.. కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాత్రం కేవలం దర్శకులు, నిర్మాతలు, హీరోలు మాత్రమే ప్రభుత్వాల.. దగ్గరికి వెళుతూ ఉన్నారు.. కానీ హీరోయిన్స్ మాత్రం ఇంతవరకు.. సినిమా ఇండస్ట్రీ తరుపున ఎక్కడా కూడా ప్రభుత్వ భేటీలలో పాల్గొన్న సందర్భాలు కనిపించడం లేదు. 

ఇటీవల గడిచిన కొన్ని గంటల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి తో మీటింగ్ లో కూడా తెలుగు హీరోయిన్స్ ఎవరూ కనిపించలేదు. 
దీంతో చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో  రెమ్యూనరేషన్ తీసుకోవడానికి, పెంచుకోవడానికి లేకపోతే బ్రాండ్స్ ప్రమోషన్ చేసుకోవడానికి హీరోయిన్స్ వస్తున్నారు. కానీ తమకు స్టార్డం తీసుకువచ్చి,  తమ జీవితాలను నిలబెడుతున్న సినీ ఇండస్ట్రీ గురించి.. అడగడానికి ఏ ఒక్క హీరోయిన్ కూడా ముందుకు రాలేదని నెటిజన్స్ తెలియజేస్తున్నారు. 

ఈ రోజున సుమారుగా 36 మంది సెలబ్రిటీలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇందులో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా  లేడీ సెలబ్రిటీలు..ఈ భేటీకి అటెండ్ కాలేదు. ముఖ్యంగా నిర్మాత సుప్రియ పేరు వినిపించింది కానీ ఆమె కూడా ఈ మీటింగ్ లో కనిపించలేదు. వీరు రాకపోవడానికి ముఖ్య కారణం ప్రభుత్వాలు వీరిని పట్టించుకోలేదనే అనుమానం కూడా మొదలవుతోంది.. మరి సినిమా ఇండస్ట్రీ పెద్దలు వీరిని పట్టించుకోవడం లేదా.. లేక వేరే తెలుగు సినిమా ఇండస్ట్రీని.. పట్టించుకోవడం లేదా అనే విషయం తెలియడం లేదు. 

మరోపక్క రెమ్యూనరేషన్  మాత్రం కోట్లు కోట్లు తీసుకుంటారు. అభిమానులకు ఆపద వచ్చినా కూడా ఎక్కడ కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే మరి కొంతమంది మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే వారు బిజీ కాల్ షీట్ల వల్ల.. రాలేకపోతున్నారేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. 

ఇక ఇటీవలే సంధ్య థియేటర్ ఘటన కూడా అందుకు నిదర్శనమని చెప్పవచ్చు.. ఎందుకంటే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు.. ఈ విషయంలో హీరోయిన్స్ పైన కూడా చాలానే విమర్శలు వినిపించాయి. పుష్ప హీరోయిన్ రష్మిక కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదనే విధంగా రూమర్స్ వినిపించాయి. మొత్తం మీద.. ప్రస్తుతం హీరోయిన్స్ ప్రవర్తన తీరు పైన సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.

Also Read: Jr NTR Fan: జూనియర్‌ ఎన్టీఆర్‌పై విమర్శలపై యూటర్న్‌.. కౌశిక్‌ తల్లి వివరణ ఇదే!

Also Read: Dil Raju: సంధ్య థియేటర్‌ బాధిత రేవతి భర్తకు దిల్‌ రాజు బంపర్‌ ఆఫర్‌.. సినిమా ఛాన్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News