Actor Arya: కోలీవుడ్ నటుడు ఆర్యకు కోర్టు నోటీసులు

Actor Arya: నటుడు ఆర్యకు కోర్టు నోటీసులు

Last Updated : Sep 20, 2020, 09:34 AM IST
Actor Arya: కోలీవుడ్ నటుడు ఆర్యకు కోర్టు నోటీసులు

చెన్నై: కోలీవుడ్ నటుడు ఆర్య (Actor Arya)కు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. వివాదాలకు దూరంగా ఉండే ఆర్యకు కోర్టు నోటీసులు పంపండం ఏంటని నటుడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏంటంటే.. 9 ఏళ్ల కిందట ఆర్య నటించిన సినిమా ‘అవన్ ఇవన్’ (తెలుగులో ‘వాడు వీడు’) తాజాగా వివాదాస్పదం అయింది. ఈ మూవీలో సింగంపట్టి జమీన్‌ను అవమానపరిచేలా సన్నివేశాలు చూపించారని నెల్లై జిల్లా, అంబా సముంద్రం కోర్టులో కొన్నేళ్ల కిందట పిటిషన్ దాఖలైంది. MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ

ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో విశాల్, ఆర్య కలిసి నటించిన ఈ సినిమా వివాదం నేటికీ కొనసాగుతోంది. సినిమాపై దాఖలైన పిటిషన్ శుక్రవారం అంబా సముద్రం కోర్టులో విచారణకు వచ్చింది. సెప్టెంబర్ 28న కేసు విచారణకు కోర్టుకు హాజరుకావాలని నటుడు ఆర్యకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కేవలం ఆర్యతోనే వివాదం ముగుస్తుందా.. లేక మూవీ యూనిట్‌కు ఇది సమస్యగా మారనుందా అనేది విచారణలో తేలనుంది. CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే! 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News