లండన్: లాక్ డౌన్ కాలంలో కరోనా తిప్పలే కాకుండా ఇంట్లో కష్టాలు అదే స్థాయిలో ఉన్నాయి. పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు తల్లిదండ్రులను ఆటపట్టిస్తున్నారు. దీంతో ఇప్పట్లో అవి తెరుచుకునే పరిస్థితి దగ్గర్లో కనబడటం లేదు. అయితే ఓ తండ్రి , కూతురు మధ్య జరిగిన ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చ్యర్యపరుస్తోంది. యూకేలో ఒక తండ్రి చేసిన చిలిపి విషయం ట్విట్టర్లో వైరల్ అయ్యింది. కాగా తండ్రి ట్విట్టర్లో పేర్కొంటూ త్వరలో పాఠశాలలు తెరుచుకోబోతున్నాయని, తరగతులు ప్రారంభం కానున్నాయని అన్నారు.
My youngest has been banging on about “prank week” and has been royally pranking us all day.
Little does she know, her father is the prank master
Both of them panicking now, the bonus is that their sadness has brought a hush into the house. pic.twitter.com/IsI6MoZb2V
— schwitz (@sentientbomb) April 21, 2020
లాక్ డౌన్ కాలంలో ఆయన కుమార్తెలు అతనిపై చిలిపి ఆట ఆడటం చూసి విసిగిపోయాడు. దీంతో నిజమైన చిలిపి మాస్టర్ ఎవరో వారికి చూపించాలని నిర్ణయించుకున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులు కోల్పోయిన విలువైన సమయాన్ని తిరిగి పొందడానికి శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహించాలని యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నిర్ణయించారని, నకిలీ లేఖ చూపించి ఆటపట్టించారు. అంతేకాకుండా పాఠశాలలు సుమారుగా ఆరు నెలల వరకు నిరంతరంగా తరగతులు కొనసాగుతాయని అన్నారు.