Ala Ninnu Cheri Review and Rating: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రల్లో నటించిన మూవీ ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించారు. నవంబర్ 10న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..? ఎలా ఉందంటే..?
కథ ఏంటంటే..?
విశాఖలోని వెంకటాపూర్‌లో గణేష్ (దినేష్ తేజ్) తన స్నేహితులతో కాలేజీ పేరుతో జాలీగా తిరుగుతుంటాడు. గణేష్ ఎలాగైనా డైరెక్టర్ కావాలని కల కంటూ.. సినిమా పిచ్చితో ఉంటాడు. ఇలా సాగుతున్న గణేష్ జీవితంలోకి దివ్య (పాయల్ రాధాకృష్ణ) ఎంట్రీ ఇస్తుంది. దీంతో గణేష్ జీవితం మరో టర్న్ తీసుకుంటుంది. వీరి ప్రేమ వ్యవహారం దివ్య తల్లి కంచు కనకమ్మ (ఝాన్సీ)కి తెలియడంతో తన కూతురిని.. బావ కాళీ (శత్రు)కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఈ సమయంలో గణేష్ వద్దకు పాయల్ రావడంతో ప్రేమ ముఖ్యమా..? కెరీర్ ముఖ్యమా..? అని సందిగ్ధంలో పడిపోతాడు. ఆ టైమ్‌లో గణేష్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? ఆ తరువాత దివ్యకు ఏం జరిగింది..? గణేష్ జీవితంలోకి అను (హెబ్బా పటేల్) ఎలా వచ్చింది..? దివ్య, గణేష్ విడిపోయారా..? అనేది తెరపై చూడాల్సిందే.
ఎవరు ఎలా నటించారంటే..?
గణేష్ క్యారెక్టర్‌లో పక్కింటి కుర్రాడిలా దినేష్ తేజ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎమోషనల్ సీన్లలో మంచి నటన కనబర్చాడు. పాయల్ ఫస్ట్ హాఫ్‌లో.. సెకండాఫ్‌లో హెబ్బా పటేల్ నటన ఆకట్టుకుంటుంది. రెండు పాత్రలకు డైరెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. పాయల్‌ను హోమ్లీ బ్యూటీ చూపిస్తే.. హెబ్బా అందాల ఆరబోతతో అలరించింది. రంగస్థలం మహేష్, బాషా, అనశ్వి, ఝాన్సీ, కల్పలత, శత్రు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
ఎలా తీశారంటే..?
లవ్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేమ మీద వచ్చాయి. వస్తునే ఉంటాయి. అలా నిన్ను చేరి మూవీ కూడా లవ్ కాన్సెప్ట్‌తోనే తెరకెక్కించారు. ప్రథమార్థంలో హీరోహీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. ద్వితీయార్థంలో వన్ సైడ్ లవ్‌లా హీరోయిన్ ప్రేమను చూపిస్తాడు. ప్రేమకు.. కెరీర్‌కు మధ్య జీవితాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించాడు డైరెక్టర్ మారేష్ శివన్. పదిహేనేళ్ల క్రితం నాటి వాతావరణం, పరిస్థితులకు తగ్గట్లు సెట్స్‌తో విజువల్స్ మంచిగా అనిపిస్తాయి. నేటి తరానికి ఈ ప్రేమ కథ ఫ్రెష్‌గా ఉంటుంది. ఎమోషనల్‌గా ఆడియన్స్‌కు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. డైలాగ్స్ మనసును హత్తుకుంటాయి. పాటలు ఓకే అనిపించగా.. ఆర్ఆర్ బాగుంటుంది. సినిమా నిడివిపై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. ఎడిటర్ కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి.
రేటింగ్ 2.7/5
Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు
Also Read: Pakistan Semi Final Scenario: పాక్ సెమీస్‌కు రావాలంటే ఇలా జరగాలి.. టాస్‌పైనే భవితవ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Ala Ninnu Cheri: అలా నిన్ను చేరి మూవీ రివ్యూ.. హెబ్బా పటేల్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మెప్పించిందా..?