Game On Movie: దిల్ రాజు, శ్రీకాంత్ చేతులమీదుగా 'గేమ్ ఆన్' బిగ్ టికెట్ లాంచ్.. ఫిబ్రవరి 2న గ్రాండ్ రిలీజ్

Game On Movie Big Ticket: ఫిబ్రవరి 2న గేమ్ ఆన్‌ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందించిన ఈ మూవీ.. టీజర్, ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ బిగ్‌ టికెట్‌ను ప్రొడ్యూసర్ దిల్ రాజు, నటుడు శ్రీకాంత్ లాంచ్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 01:44 PM IST
Game On Movie: దిల్ రాజు, శ్రీకాంత్ చేతులమీదుగా 'గేమ్ ఆన్' బిగ్ టికెట్ లాంచ్.. ఫిబ్రవరి 2న గ్రాండ్ రిలీజ్

Game On Movie Big Ticket: గీతానంద్, నేహా సోలంకి జంట‌గా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  గేమ్ ఆన్‌. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై  ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

తాజాగా గేమ్ ఆన్ మూవీ బిగ్ టికెట్‌ను నిర్మాత దిల్ రాజు, నటుడు శ్రీకాంత్, హీరోలు ఆది సాయి కుమార్, అశ్విన్, తరుణ్ లాంచ్ చేసి సినిమా సక్సెస్ కావాలంటూ విష్ చేశారు. ఆస్ట్రేలియాలో జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్.. కర్టెన్ రైజర్ ఈవెంట్ ఆదివారం హైదరాబాదులో జరిగింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న గేమ్ ఆన్ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పారు. గేమ్ థీమ్‌లో సాగుతూ యాక్షన్, రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయన్నారు. అభిషేక్ ఏఆర్ మ్యూజిక్, నవాబ్ గ్యాంగ్స్ అందించిన పాటలు ఆడియన్స్‌ను మెప్పిస్తాయన్నారు. 

==> మ్యూజిక్ డైర‌క్ట‌ర్: అభిషేక్ ఏ ఆర్;  
==> సాంగ్స్: న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌  
==> సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌   
==> స్క్రిప్ట్  సూప‌ర్ వైజ‌ర్: విజ‌య్ కుమార్ సి.హెచ్ 
==> ఎడిట‌ర్: వంశీ అట్లూరి 
==> ఆర్ట్: విఠ‌ల్‌ 
==> యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: రామ‌కృష్ణ‌, న‌భా 
==> పీఆర్ఓ: జి.కె మీడియా
==> కొరియోగ్రఫి: మోయిన్  
==> నిర్మాత‌: ర‌వి క‌స్తూరి
==> క‌థ‌-స్క్రీన్‌ ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్: ద‌యానంద్‌ 

Also Read: Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Also Read: Governor Protest: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని గవర్నర్‌ ధర్నా.. మీరెందుకు అంటూ పోలీసులపై ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News