తగ్గిన పసిడి ధరలు..

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ధరలతో భారీగా పెరిగిన బంగారం ధరలు మంగళవారం పసిడి ప్రియుల ఆశలను మళ్ళీ చిగురింపజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు ఊపందుకోవడంతో పసిడి ధరలు (Gold Rates Fall) తాగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో మంగళవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ 223 తగ్గి రూ. 46,650 పలికింది.

Also Read: Listen to her: మహిళలపై జరుగుతున్న గృహహింసపై లఘు చిత్రాన్ని నిర్మించిన నందితాదాస్..

ఇదిలాఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ గోల్డ్‌ 0.3 శాతం తగ్గి 1724 డాలర్లుగా నమోదైంది. మరోవైపు సుదీర్ఘ (Lockdown) లాక్‌డౌన్‌తో దేశీ మార్కెట్‌లోనూ బంగారం కొనుగోళ్లు నిలిచిపోవడం పసిడి డిమాండ్‌ను ప్రభావితం చేసిందని అభిప్రాయపడుతున్నారు. అయితే బంగారం ధరలు కొంతమేర తగ్గుతున్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం, భౌగోళిక, రాజకీయ అంశాల కారణంగా పసిడి ధరలు స్ధిరంగా ముందుకు కొనసాగవచ్చని పలువురు వ్యాపార దిగ్గజాలు అంచనా వేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

English Title: 
Gold Futures Fall Below Rs 46,650/10 Grams Mark Tracking Global Rates
News Source: 
Home Title: 

తగ్గిన పసిడి ధరలు..

తగ్గిన పసిడి ధరలు..
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
తగ్గిన పసిడి ధరలు..
Publish Later: 
No
Publish At: 
Tuesday, May 26, 2020 - 23:28
Created By: 
Ravinder VN
Updated By: 
Ravinder VN
Published By: 
Ravinder VN