న్యూఢిల్లీ: గృహ హింసకు గురవుతున్న మహిళలను ప్రోత్సహించడానికి నటి (Nandita Das) నందితా దాస్ ఇంట్లో (Listen to her) ఒక షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడిని అదుపులో ఉంచే ప్రక్రియలో భాగంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో గృహ హింస కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని, భారతదేశంలో, జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుండి గృహ హింస కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. మార్చి 23 నుండి ఏప్రిల్ 16 మధ్య 239 ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొంది. ఈ క్రమంలో మహిళలను ప్రోత్సహించడానికి నందితాదాస్ ఆమెను వినండి' అనే లఘు చిత్రాన్ని రూపొందించారు.
Also Read: తబ్లీగీ జమాత్‌పై 20 ఛార్జిషీట్లు..!!
7 నిమిషాల ఈ లఘు చిత్రాన్ని యూట్యూబ్‌లో పంచుకుంటూ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మహిళల నుండి 'స్టే హోమ్, స్టే సేఫ్' అనే ప్రతిస్పందన వచ్చింది. నందితా దాస్ వ్రాసిన, దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రంలో, ఇంట్లో పనిచేసే ఒక మహిళ పాత్రను నందితా దాస్ పోషిస్తుంది. ఈ చిత్రానికి యునెస్కో, యుఎన్ఎఫ్పిఎ, యునిసెఫ్, యుఎన్ ఉమెన్, సౌత్ ఆసియా ఫౌండేషన్ (మదన్జీత్ సింగ్ ఫౌండేషన్) మద్దతు ఇస్తున్నాయని నందితా దాస్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..