బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు ఇక లేరు

ప్రముఖ రచయిత, నటుడు, నాటక ప్రయోక్త , రేడియో ఆర్టిస్ట్... గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఆయన 250 చిత్రాల్లో నటించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో తెరంగేట్రం చేశారు.

Updated: Dec 12, 2019, 02:30 PM IST
బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు ఇక లేరు

ప్రముఖ రచయిత, నటుడు, నాటక ప్రయోక్త , రేడియో ఆర్టిస్ట్... గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఆయన 250 చిత్రాల్లో నటించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సంభాషణల రచయితగా, కథా రచయితగా, నటుడిగా రాణించారు. సినిమాల్లో రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాసి తెలుగు వారికి సుపరిచతమయ్యారు గొల్లపూడి. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో మారుతీరావు జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి.. కడప ఆకాశవాణి కేంద్రానికి సంచాలకుడిగా పని చేశారు. ఆయన తన రచనలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం వంటి సినిమాలు గొల్లపూడికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి. డాక్టర్ చక్రవర్తి సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఆత్మగౌరవం, కళ్లు సినిమాలకు ఉత్తమ రచయితగా నంది పురస్కారం గెలుచుకున్నారు. 

గొల్లపూడికి ముగ్గురు కుమారులు. ఆయన మూడో కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్.. తండ్రి సినీ వారసత్వాన్ని తీసుకున్నారు. ఐతే అకస్మాత్తుగా షూటింగ్ సమయంలో చనిపోయారు. కుమారుని మృతిని తట్టుకోవడానికి గొల్లపూడికి చాలా రోజులే పట్టింది. ఐతే తన కుమారుని జ్ఞాపకార్దం ఏటా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు పేరిట సినీ రంగంలో కృషి చేసిన వారిని సత్కరిస్తున్నారు.