అక్షరాలు రాయడం రాకుండానే.. ప్రొఫెసర్ అయ్యాడు

అంతర్జాతీయంగా పేరుగాంచిన గొప్ప విద్యావేత్త జాన్ కర్కోరాన్ చిన్నప్పుడు డిస్లెక్సియా అనే రుగ్మతతో బాధపడేవారు. ఆయనకు చదవడం, రాయడం వచ్చేది కాదు. కానీ టీచర్ అవ్వాలన్నది ఆయన కోరిక. అందుకే పాజిటివ్ విధానంలో ఆలోచించడం ప్రారంభించారు.

Last Updated : Oct 10, 2018, 12:22 AM IST
అక్షరాలు రాయడం రాకుండానే.. ప్రొఫెసర్ అయ్యాడు

అంతర్జాతీయంగా పేరుగాంచిన గొప్ప విద్యావేత్త జాన్ కర్కోరాన్ చిన్నప్పుడు డిస్లెక్సియా అనే రుగ్మతతో బాధపడేవారు. ఆయనకు చదవడం, రాయడం వచ్చేది కాదు. కానీ టీచర్ అవ్వాలన్నది ఆయన కోరిక. అందుకే పాజిటివ్ విధానంలో ఆలోచించడం ప్రారంభించారు. విపరీతమైన ఆత్మస్థైర్యం పెంచుకున్నారు. ఏదో సాధించాలన్న కసి ఆయన్ని క్రీడల వైపు ఆసక్తి పెంచుకొనేలా చేసింది. అదే కసితో స్టేట్ లెవెల్లో ఫుట్ బాల్ ఛాంపియన్ అయ్యాడు. పరీక్షలకు హాజరయ్యేటప్పుడు కావాలనే చేతులకు దెబ్బలు తగిలించుకుని, స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాసేవారు.

కొన్ని సార్లు చీటింగ్ చేసి, డబ్బులిచ్చి పాస్ అయ్యేవాడు. అలా డిగ్రీ వరకు నెట్టుకొచ్చాడు.తర్వాత స్పోర్ట్స్ కోటాలో పెద్ద కష్టపడకుండానే జాన్ కి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అదీ ప్రొఫెసర్ ఉద్యోగం. కానీ తనకు చదవడం, రాయడం రాదు కదా..! అందుకే పిల్లలకు ఓరల్ టెస్టులు పెట్టేవాడు. వారికి తనకున్న వాగ్దాటితో వక్తృత్వములో కోచింగ్ ఇచ్చేవాడు. ఏదైనా రాయాల్సి వస్తే..ఆ పని చేయడం కోసం ఒక జూనియర్ అసిస్టెంటుని మాత్రం పెట్టుకున్నాడు. అలా 17 సంవత్సరాలు గడిపాడు. జాన్ కర్కోరాన్ శిక్షణలో ఎందరో గొప్ప విద్యార్థులు తయారయ్యారు. 

కానీ ఒక రోజు తనకే తాను చేస్తున్న పని సరైనది కాదు అనిపించింది. అందుకే తన జీవితంలో అతి గొప్ప రహస్యాన్ని తానే బహిర్గతం చేసాడు.ఉద్యోగం కూడా వదులుకున్నాడు. 50 ఏళ్ళకు చేరువ అవుతున్న వయసులో మళ్లీ ఏ,బీ,సీ,డీలు దిద్దడం ప్రారంభించాడు. మరో 5 ఏళ్లలో ఒక పుస్తకము రాయగలిగే స్థాయికి చేరుకున్నాడు. జాన్ కథ విని ప్రపంచమే ఆశ్చర్యపోయింది. కానీ అదే జాన్ తర్వాతి కాలంలో గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కితాబునందుకున్నారు. చదవడం, రాయడం రాకుండా 17 సంవత్సరాలు జాన్ అధ్యాపకుడిగా ఎలా సేవలు అందించాడన్నది ఇప్పటికీ ఎందరో మేధావులకు సైతం అర్ధం కానీ ఒక నిగూఢ రహస్యం.

Trending News