ఐఫా 2018: ఉత్తమ నటి శ్రీదేవి.. ఉత్తమ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌‌

19వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (ఐఫా)-2018 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘనంగా జరిగింది.

Last Updated : Jun 26, 2018, 04:15 PM IST
ఐఫా 2018: ఉత్తమ నటి శ్రీదేవి.. ఉత్తమ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌‌

19వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (ఐఫా)-2018 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకకు బాలీవుడ్ తారాగణమంతా తరలివచ్చింది. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా దర్శకుడు కరణ్‌జోహార్‌, నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ వ్యవహరించారు.

 

 'మామ్' చిత్రానికి గానూ దివంగత నటి శ్రీదేవి ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె తరఫున భర్త బోనీ కపూర్ ఈ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ నటుడిగా 'హిందీ మీడియం' చిత్రంలో  నటించిన ఇర్ఫాన్ ఖాన్ నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన యూకేలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. ‘హిందీ మీడియం’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా సాకేత్‌ చౌదరి అవార్డు అందుకున్నారు. విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘తుమ్హారి సులు’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటులు శ్రీదేవి, వినోద్‌ ఖన్నా, శశికపూర్‌కు ఐఫా ఘనంగా నివాళులు అర్పించింది.

రణ్‌బీర్‌కపూర్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, కృతి సనన్, బాబీ డియోల్, శ్రద్ధా కపూర్ తమ పర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత సీనియర్‌ నటి రేఖ స్టేజీపై నృత్య ప్రదర్శన ఇవ్వటం కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది.

 

 

అవార్డులు అందుకున్నది వీళ్లే..

  • ఉత్తమ చిత్రం- తుమ్హారి సులు
  • ఉత్తమ దర్శకుడు- సాకేత్‌ చౌదరి(హిందీ మీడియం)
  • ఉత్తమ నటుడు- ఇర్ఫాన్‌ ఖాన్‌ (హిందీ మీడియం)
  • ఉత్తమ నటి-శ్రీదేవి (మామ్)
  • ఉత్తమ సహయ నటుడు-నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (మామ్‌)
  • ఉత్తమ సహయ నటి-మెహర్‌ వీఐజే (సీక్రెట్‌ సూపర్‌స్టార్‌)
  • ఉత్తమ కథ- న్యూటన్‌ చిత్రం(అమిత్‌ వీ మసూర్‌కర్‌)
  • ఉత్తమ సంగీత దర్శకుడు -అమాల్‌ మాలిక్‌, తనిష్క్‌ బాగ్చి, అఖిల్‌ సచ్‌దేవ-బద్రీనాథ్‌ కీ దుల్హానియా
  • బెస్ట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ -ప్రీతమ్‌ (జగ్గా జసూస్‌ చిత్రానికి)
  • బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే -నితీశ్‌ తివారీ, శ్రేయస్‌ జైన్‌ (బరేలీ కీ బర్ఫీ)
  • ఉత్తమ కొరియోగ్రఫీ-విజయ్‌ గంగూలీ, రూలె దౌసన్‌ వరిందని (జగ్గా జసూస్‌ చిత్రంలోని గల్తీ సే మిస్టేక్‌ పాటకు)
  • ఉత్తమ డైలాగులు-హితేష్‌ కేవల్య(సుభ మంగళ్‌ సావధాన్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ-మార్కిన్‌ లస్కవైక్‌, యూఎస్‌సీ(టైగర్‌ జిందా హై చిత్రానికి గానూ...)
  • ఉత్తమ ఎడిటింగ్‌- శ్వేత వెంకట్‌ మాథ్యూ (న్యూటన్‌)
  • ఉత్తమ సింగర్‌(మహిళా)- మేఘనా మిశ్రా(సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ చిత్రంలోని మైన్‌ కౌన్‌ హూ పాటకు)
  • ఉత్తమ సాహిత్యం - మనోజ్‌ ముంటషిర్‌ (బాద్‌షావో చిత్రంలోని మెరే రష్కే ఖమర్‌ పాటకు...)
  • ఉత్తమ సింగర్‌ (మేల్‌)- అర్జిత్‌ సింగ్‌( జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌ చిత్రంలోని హవాయెన్‌ పాటకు)
  • ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ - కోంకణ్‌ సేన్‌ శర్మ
  • అవుట్‌స్టాండింగ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు- సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌
  • ఉత్తమ స్టైల్‌ ఐకాన్‌- నటి కృతి సనన్‌
  • ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు - ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా (జగ్గా జసూస్‌ చిత్రం)
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ - దిలీప్‌ సుబ్రమణియమ్‌-గణేశ్‌ గంగాధరన్‌(వైఆర్‌ఎఫ్‌ స్టూడియోస్‌).. టైగర్‌ జిందా హై చిత్రం

Trending News