రవితేజ సీక్రెట్ లీక్ చేసిన ఇలియానా

రవితేజ సీక్రెట్ లీక్ చేసిన ఇలియానా

Last Updated : Nov 10, 2018, 09:28 PM IST
రవితేజ సీక్రెట్ లీక్ చేసిన ఇలియానా

రవితేజ, ఇలియానా కాంబినేషన్ అంటే ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కిక్, ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు చిత్రాల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కిన నాలుగో చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. అంతేకాకుండా టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పి బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇల్లీ బేబీ మళ్లీ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సినిమా కూడా ఇదే. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన అమర్ అక్బర్ ఆంటోని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా ఇల్లీ పలు ఆసక్తికరమైన విశేషాలను వేదికపై పంచుకుంది. అందులో ముఖ్యమైనది రవితేజ సిక్స్ ప్యాక్ బాడీ గురించి. అవును, ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్స్‌లో కానీ టీజర్‌లో కానీ వెల్లడించని ఈ విషయాన్ని ఇలియానా ఈ వేదికపై చెప్పేసింది. 

కిక్ సినిమాకు ఈ సినిమాకు రవితేజలో ఏమైనా తేడా ఉందా అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ... రవితేజలో అప్పుటికన్నా ఇంకా ఎక్కువ జోష్ ఉందని బదులిచ్చింది. అన్నింటింకిమించి ఇప్పుడు రవితేజకు సిక్స్ ప్యాక్ కూడా వచ్చేసిందని చెప్పింది ఇల్లీ. ఇలియానా లీక్ చేసిన ఈ సీక్రెట్ మాస్ మహారాజ ఫ్యాన్స్ అమర్ అక్బర్ ఆంటోని మూవీపై అంచనాలు మరింత రెట్టింపయ్యేలా చేసింది.

Trending News