International Yoga Day 2020: నేడే యోగా డే..

 ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులు మానవాళిని కబళించేస్తున్నాయి. మానవ మనుగడకే సవాల్ విసురుతున్నాయి. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశమంటున్నారు యోగా నిపుణులు.

Last Updated : Jun 21, 2020, 12:01 AM IST
International Yoga Day 2020: నేడే యోగా డే..

హైదరాబాద్:  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులు మానవాళిని కబళించేస్తున్నాయి. మానవ మనుగడకే సవాల్ విసురుతున్నాయి. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశమంటున్నారు యోగా నిపుణులు. యోగా జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతీ రోజు యోగా సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా స్పందిస్తూ.. నేను ప్రతీ రోజూ యోగా సాధన చేస్తున్నానని, మానవుడు యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందగలడని అన్నారు. కాగా ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మద్యం హోం డెలివరీకి amazon.comకు గ్రీన్‌ సిగ్నల్

Also Read: Covid-19 drug: 103 రూపాయలకే కరోనా ఔషధం..

యోగాను గతేడాది నుంచి అన్నీ వర్గాల ప్రజల్లో, పాఠశాలల్లో క్రియాశీలకంగా ప్రవేశపెట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన మీరు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రోగ నిరోధక శక్తి తప్పక పెరుగుతుందని, ఎలాంటి వ్యాధులైనా.. ఎదుర్కొనే శక్తి లభిస్తుందని., ఏలాంటి ఖర్చు లేకుండా ఉన్న యోగాను అందరూ సాధన చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని ప్రజలను కోరారు. మిమ్మల్ని అందరినీ యోగా సాధనకు సాదరంగా ఆహ్వానిస్తున్నానని యోగ చేద్దాం.. ఆరోగ్య తెలంగాణగా మార్చుదామని మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపు నిచ్చారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News