Punch Prasad Health : కదల్లేని పరిస్థితుల్లో పంచ్ ప్రసాద్.. సాయం చేయండని కోరిన నూకరాజు

Punch Prasad Health Issue పంచ్ ప్రసాద్‌కు కిడ్నీల సమస్యల ఉందన్న సంగతి తెలిసిందే. రెండు కిడ్నీలు చెడిపోయినా కూడా ధైర్యంగా నిలబడి.. అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 04:20 PM IST
  • క్షీణించిన పంచ్ ప్రసాద్ అనారోగ్యం
  • జబర్దస్త్ నూకరాజు వీడియో వైరల్
  • వీల్ చైర్‌కే పరిమితమైన కమెడియన్
Punch Prasad Health : కదల్లేని పరిస్థితుల్లో పంచ్ ప్రసాద్.. సాయం చేయండని కోరిన నూకరాజు

Punch Prasad Health Issue : పంచ్ ప్రసాద్ ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నాడని, సాయం చేయండని నూకరాజు కోరాడు. పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసిందే. తన భార్య తన కోసం కిడ్నీ దానం చేసేందుకు సిద్దంగా ఉందని స్టేజ్ మీదే ఎన్నో సార్లు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. పంచ్ ప్రసాద్ అనారోగ్య విషయంలో మల్లెమాల గానీ, శ్యాం ప్రసాద్ రెడ్డి గానీ ఎలాంటి సాయం చేయలేదంటూ ఇది వరకే ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. నాగబాబు మాత్రం అందరి దగ్గరా డబ్బులు కలెక్ట్ చేసి పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కోసం దాచి ఉంచాడని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరింతగా క్షీణించిందని తెలుస్తోంది.

పంచ్ ప్రసాద్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండు కిడ్నీలు చెడిపోవడంతో మధ్యలో ఆస్పత్రిలోనే ఉన్నాడు. అప్పుడు జబర్దస్త్ షోను మానేశాడు. ఆ సమయంలోనూ నాగబాబు ఆధ్వర్యంలో డబ్బులు కలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు పంచ్ ప్రసాద్‌కు శ్రీదేవీ డ్రామా కంపెనీ, జాతి రత్నాలు, జబర్దస్త్ షో అంటూ ఇలా నెలకు మూడు నుంచి నాలుగు లక్షల పని కల్పించింది అంటూ మల్లెమాల గురించి ఆది ఎంతో గొప్పగా చెప్పాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News