అమీర్ ఖాన్ "మహాభారతం" సినిమాలో నటిస్తే తప్పేంటి..?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వేదవ్యాసుడు రచించిన "మహాభారతం" ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Last Updated : Mar 23, 2018, 11:42 AM IST
అమీర్ ఖాన్ "మహాభారతం" సినిమాలో నటిస్తే తప్పేంటి..?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వేదవ్యాసుడు రచించిన "మహాభారతం" ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రాన్ని ముఖేష్ అంబానీ నిర్మిస్తున్నారని.. అందులో అమీర్ ఖాన్ కర్ణుడు లేదా శ్రీక్రిష్ణుడి పాత్రను పోషించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తే ఓ వివాదానికి దారి తీసింది.

ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన ఈ వార్తపై ఫ్రెంచి కాలమిస్ట్ ఫ్రాంకోయిస్ గౌతియార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అతి గొప్ప హిందూ ఇతిహాసమైన మహాభారతంలో ఓ ముస్లిం నటించడమేమిటి? కొంపదీసి బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ వారిలా సెక్యూలర్ కిరీటం పెట్టుకోవాలని భావిస్తుందా? ఒకవేళ ఎవరైనా ఇస్లామ్ ప్రవక్త అయినటు వంటి మహమ్మద్ జీవిత కథను సినిమాగా తీస్తే.. అందులో ఆ పాత్రలో హిందువు నటిస్తే ఒప్పుకుంటారా? అని ఆయన ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ప్రముఖ గేయరచయిత జావేద్ అక్తర్ జవాబిచ్చారు. తనదైన శైలిలో గౌతియార్ పై విరుచుకుపడ్డారు. ఆయనను స్కౌండ్రల్ అని తిట్టారు. మహాభారతాన్ని విదేశీ నటీనటులను పాత్రధారులుగా పెట్టి.. ఒక నాటకంగా రూపొందించి పీటర్ బ్రూక్స్ ఫ్రాన్స్‌లో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు నువ్వు చూడలేదా? భారతీయుల మనసులలో  విషబీజాలను నాటడం కోసం నీకు డబ్బులిచ్చిన ఆ విదేశీ పత్రిక పేరేంటో నాకు చెప్పు అని ప్రశ్నించారు.

ఆ ట్వీట్‌కు ఎవరో ట్వీట్ చేస్తూ... గౌతియార్ వల్ల భారతీయులకు ప్రమాదం ఏమీ లేదని.. అమీర్ ఖాన్ వల్ల... జావేద్ అక్తర్ లాంటి వల్లే దేశానికి ప్రమాదమని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు అక్తర్ సమాధానమిచ్చారు. "బుర్రలేని నీకు భారతీయుల సంప్రదాయాల గురించి ఏమీ తెలియదు. నీకు రాస్ ఖాన్ బుల్లే
షా వారిస్ షా గానీ, బాబా ఫరీద్ నజర్ అక్బరాబాదీ గానీ, నిజిర్ బనారసీ గానీ, బిస్మిల్లా ఖాన్ గానీ తెలుసా.. నీకు వారెవరో కూడా తెలియదు. నువ్వు నూతిలో కప్పలాంటి వాడివి" అని సమాధానమిచ్చారు. 

Trending News