జియో మరో బంపర్ ఆఫర్; ప్రైమ్ మెంబర్స్‌కు 100 % క్యాష్‌బ్యాక్

ఫ్లాస్...ఫ్లాష్ జియో కస్టమర్లను గుడ్ న్యూస్

Updated: Jan 17, 2018, 01:38 PM IST
జియో మరో బంపర్ ఆఫర్; ప్రైమ్ మెంబర్స్‌కు 100 % క్యాష్‌బ్యాక్

సమ్మర్ ఆఫర్..వింటర్ ఆఫర్ అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ సంచలనం సృష్టిస్తున్న జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'సర్‌ప్రైజ్‌ క్యాష్‌బ్యాక్‌' ఆఫర్ సమయం ముగియడంతో జియో ఈ సరికొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చి కష్టమర్లను ఆకట్టుకుంది.  కాగా ఈ సరికొత్త ఆఫర్ ప్రకారం రూ.398 .. ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై మొత్తం రూ.700  వరకు 100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ను పొందే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ జనవరి 31 వరకు అందుబాటులో ఉండనుంది. కాగా జియో మొబైల్ రీఛార్జీ, డిజిటల్ వాలెట్ల రీఛార్జ్ ద్వారా ఈ క్యాష్ బ్యాక్ పొందవచ్చని జియో ప్రకటించింది.

ఒక ఆఫర్ ..రెండు ప్రయోజనాలు

జియో అందిస్తున్న ఈ సరికొత్త ఆఫర్ తో రెండు విధాలుగా యూజర్లు 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందనున్నారు. ఒకటి జియో టారిఫ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌, రెండు డిజిటల్‌ వాలెట్ల రీఛార్జ్‌ల ద్వారా ఈ క్యాష్‌బ్యాక్‌ యూజర్లకు లభిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను ఒక్క సారి పరిశీలిద్దాం....

 జియో టారిఫ్‌ ప్లాన్‌ రీఛార్జ్ ఆఫర్ విశేషాలు 
* రూ.398... ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై 400 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌
*  ఎనిమిది వోచర్ల రూపంలో క్యాష్‌బ్యాక్‌
*  ఒక్కో వోచర్ విలువ రూ. 50 
* మై జియో యాప్‌లో కనిపించనున్న వోచర్లు  (మై ఓచర్స్) 
* రీఛార్జ్ అయిన వెంటనే  కస్టమర్ల అకౌంట్‌లోకి వోచర్లు
* ఈ వోచర్లను తర్వాత చేసుకునే 300 రూపాయలు.. ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రిడీమ్‌ చేసుకునే ఛాన్స్

 డిజిటల్‌ వాలెట్ల రీఛార్జ్‌ ఆఫర్ విశేషాలు
* డిజిట‌ల్ వాలెట్ల రీఛార్జ్ ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, అమెజాన్‌ పే, ఫోన్‌పే, భీమ్‌, యాక్సిస్‌పే ద్వారా చేయాల్సి ఉంది.
* జియో ప్రైమ్‌ మెంబర్లకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ కింద రూ.300 వరకు అందించ‌నుంది
* మొత్తంగా 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ జియోప్రైమ్‌ మెంబర్లకు ఆఫర్‌ చేస్తుంది

సరికొత్త జియో ఆఫర్ సంబంధించిన మరింత సమచారం జియో అఫీషియల్ వెబ్ సైట్ లో చూడవచ్చు.