యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన అరవింద సమేత సినిమాలో కథను క్లైమాక్స్‌కు నడిపించిన పీస్ మీటింగ్ సన్నివేశం సినిమాలో హైలైట్‌గా నిలిచింది. హింసను వదిలేసి శాంతిని స్థాపిద్దామని విలన్‌కి నచ్చచెప్పే ప్రయత్నంలో ప్రత్యర్థికి క్షమాపణలు చెప్పే ఎన్టీఆర్.. కాదూ కూడదంటే " పులివెందుల పూలంగల్ల కానుంచి, కడప కోటి రెడ్డి సర్కిల్ దాంకా.. కర్నూలు కొండారెడ్డి బురుజు కానుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాంకా.. బళ్లారి గనుల్లో దాకున్నా.. బెళగావ్‌లో పండుకున్నా వదలా.. తరుముకుంటా వస్తా.." అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆ సన్నివేశం తీవ్రతను చెబుతుంది. తాజాగా తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆ చిత్ర నిర్మాతలు ఆ డైలాగ్‌ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. రాయలసీమ యాసలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్‌కి ఆ ప్రాంతంలోని పలు సంఘాల నుంచి కొంత విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. అభిమానుల నుంచి మాత్రం భారీ సంఖ్యలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.