శ్యామ్ కె నాయుడుపై సినీ ఆర్టిస్ట్ ఫిర్యాదు, అరెస్ట్ !

శ్యామ్.కె.నాయుడు ( Shyam K Naidu ) తనను మోసం చేశాడంటూ సాయి సుధ ( Sai Sudha ) అనే సినీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా తనతో రిలేషన్‌షిప్ మెయింటెన్ చేసిన శ్యామ్ కే నాయుడు ఇప్పుడు పెళ్లి మాట దాటేస్తున్నాడని సాయి సుధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ( SR Nagar ) కేసు నమోదైంది.

Last Updated : May 27, 2020, 05:30 PM IST
శ్యామ్ కె నాయుడుపై సినీ ఆర్టిస్ట్ ఫిర్యాదు, అరెస్ట్ !

హైదరాబాద్: సినీరంగంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఫిర్యాదు బయటికొస్తూనే ఉంటాయి. అదే వివాదాల్లో ప్రముఖుల పేర్లు వినబడితే.. ఆ వివాదానికి ఏర్పడే ప్రాధాన్యతే వేరు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. టాలీవుడ్‌లో పేరుమోసిన కెమెరామ్యాన్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు  శ్యామ్.కె.నాయుడు ( Shyam K Naidu ) తనను మోసం చేశాడంటూ సాయి సుధ ( Sai Sudha ) అనే సినీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా తనతో రిలేషన్‌షిప్ మెయింటెన్ చేసిన శ్యామ్ కే నాయుడు ఇప్పుడు పెళ్లి మాట దాటేస్తున్నాడని సాయి సుధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ( SR Nagar ) కేసు నమోదైంది. సాయి సుధ ఫిర్యాదు మేరకు బుధవారం ఉదయం ఎస్ఆర్ నగర్ పోలీసులు శ్యామ్ కే నాయుడుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. TDP Mahanadu 2020 : టిడిపి మహానాడు 2020 ప్రారంభం.. మహానాడుకు ప్రత్యేక ఏర్పాట్లు )

పోకిరి, టెంపర్, డిక్టేటర్, శివమణి లాంటి హిట్ సినిమాలు ఎన్నో సినిమాటోగ్రాఫర్‌గా శ్యామ్ కె నాయుడి హిట్ చిత్రాల జాబితాలో ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌కి శ్యామ్ కే నాయుడు సన్నిహిత మిత్రుడు. పూరి డైరెక్ట్ చేసిన అనేక చిత్రాలకు శ్యామ్ కే నాయుడు సినిమాట్రోగ్రఫి అందించాడు. గతేడాది టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులోనూ ప్రముఖంగా వినిపించిన పేర్లతో పాటు విచారణ ఎదుర్కున్న వారిలో శ్యామ్ కే నాయుడు కూడా ఒకరు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News