కాజల్ బర్త్ డే గిఫ్ట్.. రణరంగం ఫస్ట్ లుక్

కాజల్ బర్త్ డే గిఫ్ట్.. రణరంగం ఫస్ట్ లుక్

Last Updated : Jun 19, 2019, 01:40 PM IST
కాజల్ బర్త్ డే గిఫ్ట్.. రణరంగం ఫస్ట్ లుక్

కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు కానుకగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ రణరంగం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. బీచ్ ఒడ్డున చీర్ గర్ల్‌లా ఉన్న ఫోటోతో అమ్మడు ఫస్ట్ లుక్‌కి ఫోజిచ్చింది. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో శర్వాకు కాజల్ జంటగా నటిస్తోంది. హలో, చిత్రలహరి చిత్రాల ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటిస్తోంది. స్వామి రారా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై కాజల్ భారీ అంచనాలే పెట్టుకుంది. ఖైదీ నెంబర్ 150 ఆమె ఖాతాలో చివరి హిట్ కాగా ఆ తర్వాత తెలుగులో ఆమె చేసిన సినిమాలు ఏవీ కలిసిరాకపోవడమే అందుకు ఓ కారణం.

 

ఇదిలావుంటే, మరోవైపు రఫ్ గడ్డంతో శర్వానంద్ లుక్ కూడా ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక రణరంగం సినిమా ఎలా ఉండనుందో తెలియాలంటే ఆగష్టు 2వ తేదీన సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

Trending News