నాల్గో విడుత పోలింగ్ లైవ్ అప్ డేట్స్ ;  ఓటేసేందుకు క్యూకట్టిన జనాలు

Last Updated : Apr 29, 2019, 10:24 AM IST
నాల్గో విడుత పోలింగ్ లైవ్ అప్ డేట్స్ ;  ఓటేసేందుకు క్యూకట్టిన జనాలు
Live Blog

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నాల్గో విడుత పోలింగ్ కొనసాగుతోంది. ఈ దఫా మొత్తం 9 రాష్ట్రాల్లో 71 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో సోమవారం పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు.. పోలింగ్ బూత్ ల వద్ద క్యూకట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.

29 April, 2019

  • 10:21 AM

    లోక్ సభ నాల్గో విడత పోలింగ్ లో భాగంగా మధ్యప్రదేశ్ లో ఉదయం 10 గంటల సమయానికి 11:39 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక్కడ మొత్తం 6 లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి కమల్ నాథ్ బరిలో నిలిచిన  చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు

     

  • 09:42 AM

    మధ్యప్రదేశ్ లో ఉదయం 9 గంటలకు 8.5 శాతం పోలింగ్ నమోదు అయింది. నాల్గో విడతలో భాగంగా ఇక్కడ మొత్తం 6 లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతన్నాయి. అలాగే ముఖ్యమంత్రి కమల్ నాథ్ పోటీ చేస్తున్న  చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు

  • 09:37 AM

    ఒడిషాలో నాల్గో విడత పోలింగ్ లో భాగంగా  ఉదయం 9 గంట వరకు 9 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.  కాగా ఒడిషాలో ఈ విడతలో మొత్తం 6 లోక్ సభ స్థానాలతో పాటు 41 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి

  • 09:23 AM

    ఉప పోరులో ముఖ్యమంత్రి కమల్ నాథ్..
    మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌- ఛింద్‌వాడా శాసనసభ (ఉపఎన్నిక) స్థానానికి, ఆయన తనయుడు నకుల్‌నాథ్‌.. ఛింద్‌వాడా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఛింద్‌వాడా ఎంపీగా ఉన్న కమల్ నాథ్ ను కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందున ఆయన  తన కుమారుడు రాజీనామా చేసిన స్థానంలో  ఎమ్మెల్యే అభ్యర్ధిగా  కమల్‌నాథ్ ఉప పోరులో తలపడుతున్నారు . ఇదిలా ఉండగా కమల్ నాథ్ ఎంపీగా 9 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఛింద్‌వాడా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన తనయుడు నకుల్‌నాథ్‌ బరిలో ఉండడం విశేషం. 

  • 09:21 AM

    బరిలో ఉన్న ప్రముఖులు వీరే...

    నాల్గో విడతలో పలువురు ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేంద్ర మంత్రులు గిరిరాజ్‌ సింగ్‌, సుభాష్‌ భామ్రే, ఎస్‌ఎస్‌ అహ్లువాలియా, బాబుల్‌ సుప్రియో తో పాటు బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మతోంద్కర్, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్, పూనం మహాజన్, మిలింద్ దేవరాలతోపాటు సల్మాన్ ఖుర్షీద్, శతాబ్దీరాయ్‌, మూన్‌మూన్‌ సేన్‌ తదితర  ప్రముఖులు నాలుగో దశలో పోటీపడుతున్నారు.

Trending News